స్టార్ ఆఫర్ కాదన్న బ్యూటీ..?

ఐతే ప్రేమలు 2 చేయాల్సి ఉన్న మమితా తెలుగు ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఐతే అది టైర్ 2 హీరో సినిమా అని.. అందులో మమితా నటిస్తే బాగుంటుందని మేకర్స్ అనుకున్నారు.

Update: 2024-07-20 15:30 GMT

ప్రేమలు సినిమాతో సౌత్ ఆడియన్స్ కు ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కి ఫేవరేట్ గా మారిపోయింది మలయాళ భామ మమితా బైజు. అంతకుముందు అమ్మడు దాదాపు ఏడేళ్లుగా సినిమాలు చేస్తున్నా ప్రేమలు తో వచ్చిన పాపులారిటీ రాలేదు. ప్రేమలు సినిమాలో అమ్మడి నటన క్యూట్ నెస్ ఆడియన్స్ కు బాగా నచ్చేశాయి. ప్రేమలు సినిమా చూశాక యువత మొత్తం మమితా నామ జపాన్నే చేశాయంటే నమ్మాలి. ఇలా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ ఏదైనా ఛాన్స్ రాగానే అలా పట్టేసుకుంటారు కానీ మమితా బైజు మాత్రం అందుకు రివర్స్ లో ఉన్నట్టు ఉంది.

ప్రేమలు సూపర్ హిట్ అవ్వడంతో అదే టీం తో డైరెక్టర్ ప్రేమలు 2 ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ మీద ఉంది. ఐతే ప్రేమలు 2 పూర్తి కాగానే అమ్మడికి మిగతా పరిశ్రమల నుంచి ఆఫర్ లు రెడీగా ఉన్నారు. తెలుగు నుంచి కూడా మమితా బైజుకి ఒక ఆఫర్ సిద్ధంగా ఉందని టాక్. ప్రేమలు రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో అమ్మడి క్రేజ్ చూసి ఒక బడా నిర్మాత సినిమాలో నటించాలని కోరాడట.

ఐతే ప్రేమలు 2 చేయాల్సి ఉన్న మమితా తెలుగు ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఐతే అది టైర్ 2 హీరో సినిమా అని.. అందులో మమితా నటిస్తే బాగుంటుందని మేకర్స్ అనుకున్నారు. కానీ అమ్మడు ఇప్పుడు కష్టమని చెప్పగా ఆ టీం వేరే హీరోయిన్ ని వెతుక్కుంది. ప్రేమలు 2 తర్వాత అయినా మమితా తెలుగు సినిమాలు చేస్తుందా లేదా మళ్లీ ఇలానే బిజీ అని వదిలేస్తుందా అన్నది చూడాలి.

మలయాళం తర్వాత ప్రేమలు సినిమాను ఆ రేంజ్ హిట్ చేసింది తెలుగు ఆడియన్సే. అందుకే ప్రేమలు 2 సినిమాలో కూడా తెలుగు ఆడియన్స్ కు మెప్పించే అంశాలని పెట్టబోతున్నారట. ఐతే మమితా బైజు కి ఉన్న ఫాలోయింగ్ చూసి మన మేకర్స్ ఆమెతో సినిమాలు చేయాలని అనుకుంటుంటే అమ్మడు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వట్లేదట. మరి కథ నచ్చక కాదంటుందా లేదా టాలీవుడ్ ఎంట్రీకి ఇంకా టైం తీసుకోవాలని అనుకుంటుందా అన్నది తెలియదు కానీ మమితా బైజు తెలుగు ఎంట్రీ మాత్రం లేట్ అయ్యేలా ఉంది.

Tags:    

Similar News