పోస్ట‌ర్ టాక్: మెగాస్టార్ భ‌య‌పెడుతున్నాగా!

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య `బ్ర‌హ్మ‌యుగం` అనే సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-01-01 08:30 GMT

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య `బ్ర‌హ్మ‌యుగం` అనే సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. కేర‌ళ‌లోని చీక‌టి యుగాల నేప‌థ్యంలో రాహుల్ స‌దాశివ‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే ఇదో ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మ‌ని అనిపించింది. మమ్ముట్టి ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి ప్ర‌యోగిం చేసింది లేదు. తొలిసారి హార‌ర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో చేస్తోన్న చిత్ర‌మిది.


కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాల కాలం నాటి కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొంది స్తున్నారు. దీంతో ఈ సినిమా ప్ర‌క‌ట‌న‌తోనే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. అటుపై రిలీజ్ అయిన పోస్ట‌ర్లు అంతే క్యూరియాసిటీని రెట్టింపు చేసాయి. తాజాగా న్యూ ఇయ‌ర్ ని పుర‌స్క‌రించుకుని మ‌మ్ముట్టి న్యూ లుక్ రిలీజ్ చేసారు. లుక్ ఎంతో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది. కేర‌ళ సంప్ర‌దాయాన్ని పోలిన దైవ పాత్ర‌లో మ‌మ్ముట్టి ఆహార్యం ఎంతో ఇంటెన్స్ గా హైలైట్ అవుతుంది.

డార్క్ మోడ్ లో పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. మెడ‌లో రుద్రాక్ష‌లు..త‌ల‌పై కొమ్ముల‌తో కూడాన కిరీటం.. దేవ‌తావ‌త‌రంలో క‌ళ్లు..అన్నీ మ‌మ్ముట్టిని చాలా కొత్త‌గా ప్ర‌జెంట్ చేస్తున్నాయి. పోస్ట‌ర్ నే ఈ రేంజ్ లో ఉందంటే? పాత్ర ప‌రంగా ఇంకే స్థాయిలో ఉంటుందో? అన్న అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. కాంతార‌లో రిష‌బ్ శెట్టి `బూత కోలం` కాన్సెప్ట్ ని ఈ పోస్ట‌ర్ త‌ల‌పిస్తున్న‌ట్లుంది. ఇక ట్రైల‌ర్ లాంటివి మ‌రింత ఆస‌క్తిక‌రంగా రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. మ‌మ్ముట్టి ఆహార్యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ షురూ అయింది. ఇటీవ‌లే ఈ సినిమాకి సంబంధించిన కీల‌క షెడ్యూల్ ని ఒట్టపాలెంలో భారీ స్థాయిలో చిత్రీకరించారు. సినిమాలో ఆ స‌న్నివేశాలు హైలైగా ఉంటాయ‌ని యూనిట్ రివీల్ చేసింది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్- సిద్ధార్థ్ భరతన్- అమల్దా లిజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్- క్రిస్టో జేవియర్ సంగీతం సమకూరుస్తున్నారు. డైలాగ్‌లు టిడి రామకృష్ణన్ అందిస్తున్నారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్- వైఎన్‌ఓటి స్టూడియోస్ సమర్పణలో చ‌క్ర‌వ‌ర్తి రామ‌చంద్ర‌-శిషికాంత్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తు న్నారు. మలయాళం- తమిళం- తెలుగు- కన్నడ- హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Tags:    

Similar News