ట్రెండింగ్: మోహన్ బాబు – మనోజ్... మధ్యలో (విష్ణు) బౌన్సర్లు!

మంచు మనోజ్ ఇంటి చుట్టు విష్ణు మనుషులు మొహరించి ఉన్నారు.. మనోజ్ ఇంటి దగ్గర ప్రైవేటు బౌన్సర్లు కాపలాగా ఉన్నారు.

Update: 2024-12-09 09:01 GMT

మంచు మనోజ్ ఇంటి చుట్టు విష్ణు మనుషులు మొహరించి ఉన్నారు.. మనోజ్ ఇంటి దగ్గర ప్రైవేటు బౌన్సర్లు కాపలాగా ఉన్నారు.. అనే విషయం ఇప్పుడు అటు సినిమా ఇండస్ట్రీలోనూ, అటు మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి మొదలైన ఈ వ్యవహారంపై ప్రచారం సోమవారం మరింత హాట్ టాపిక్ గా మారింది.

అవును... మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మనోజ్ మధ్య గొడవ జరిగిందని.. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారంటూ ఆదివారం ఉదయం నుంచి వార్తలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. అదంతా అసత్య ప్రచారం అని, అందులో నిజం లేదంటూ విష్ణు పీఅర్వో టీమ్ స్పందించింది.

ఆ సమయంలో.. నడవాడనికి కాస్త ఇబ్బంది పడుతున్నట్లు ఆస్పత్రి వద్ద కనిపించారు మనోజ్. దీంతో... కాలికి గాయం ఎలా అయ్యింది? ఉదయం నుంచి వస్తున్న వార్తలు నిజమేనా? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మనోజ్ స్పందించలేదు! ఈ నేపథ్యంలో... మనోజ్ మెడికో లీగల్ రిపోర్ట్ వచ్చిందనే విషయం తెరపైకి వచ్చింది.

ఆ మెడికో లీగల్ రిపోర్ట్ తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... మనోజ్ కు కడుపు, వెన్నెముక, ఎడమ కాలి పిక్క భాగంలో దెబ్బలు తగిలాయని.. మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లు ఉన్నాయని తేలిందని అంటున్నారు! దీంతో... మంచు మనోజ్ కు ఇంత బలమైన గాయాలు ఎలా తగిలాయనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో... ఇంటి వద్ద విష్ణు సుమారు 40 మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టారని.. మనోజ్ తరుపున 30 మంది బౌన్సర్లు ఉన్నారని అంటున్నారు! అయితే... వీరిలో విష్ణు తరుపు బౌన్సర్లను మాత్రమే మోహన్ బాబు ఇంటిలోనికి భద్రతా సిబ్బంది అనుమతించారని... మనోజ్ తరుపు బౌన్సర్ లను మాత్రం బయటే ఉంచారని అంటున్నారు.

మరోవైపు మంచు విష్ణు.. ఇంకా విదేశాల్లోనే ఉన్నారని తెలుస్తోంది. ఆయన తన పర్యటన ముగిసి, తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాతనే ఈ అంశంపై స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటి వద్ద విష్ణు బౌన్సర్లను దింపారని ప్రచారం జరుగుతోంది.

అయితే... అసలు సమస్య ఏమీ లేకపోతే విష్ణు, మనోజ్ లు పోటా పోటీగా ఇంతమంది బౌన్సర్లను ఇంటివద్ద ఎందుకు మొహరించాల్సి వచ్చిందనే చర్చా తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో మంచు మనోజ్ కి సంబంధించిన అనుచరులు, అభిమానులను కూడా ఇక్కడ లోనికి అనుమతించడం లేదని అంటున్నారు. దీంతో ఈ రోజు మోహన్ బాబు ఇంటివద్ద ఏమి జరగబోతోందనేది అత్యంత హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి!!



Full View


Tags:    

Similar News