ముంబైకి మంచు డాటర్.. పెర్ఫెక్ట్ ప్లాన్ తోనే!

కెరీర్ ను కొత్త ప్రారంభించాలని నార్త్ కు వెళ్లినట్లు చెప్పింది. బాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేస్తోంది.

Update: 2024-07-10 05:39 GMT

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. నిర్మాతగా, ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో దూసుకెళ్తోంది. తండ్రి చూపిన సినీ బాటలోనే నడుస్తూ అందరినీ అలరిస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా వెబ్ సిరీసుల్లో కూడా యాక్ట్ చేసి సందడి చేస్తోంది మంచు డాటర్. ఇటీవల హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయింది లక్ష్మి.

కెరీర్ ను కొత్త ప్రారంభించాలని నార్త్ కు వెళ్లినట్లు చెప్పింది. బాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేస్తోంది. ఆడిషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలిపింది. బీ టౌన్ లో ఎవరితో వర్క్ చేయాలని ఉందో కూడా ఆ మధ్య చెప్పింది. ఇక నాలుగు పదుల వయసులో కూడా అందాల ఆరబోతలో దూసుకుపోతోంది. తగ్గేదే లే అంటూ ప్రజెంట్ హీరోయిన్లకు పోటీగా గ్లామరస్ పోజులు ఇస్తుంటోంది. ముంబై వెళ్లాక గ్లామర్ గేట్లు ఎత్తేసి సందడి చేస్తోంది.

అయితే ముంబై షిఫ్ట్ అవ్వడం గురించి రీసెంట్ గా మరోసారి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది మంచు డాటర్. ముంబైలోనే ఉంటున్నారా, లేకుంటే పూర్తిగా షిఫ్ట్ అయ్యారా అని మంచు లక్ష్మిని హోస్ట్ అడిగారు. "నా ఫ్రెండ్స్ అందరూ నన్ను తిడుతున్నారు. ముంబై ముంబై అంటావ్.. హైదరాబాద్ లోనే ఎక్కువ కనిపిస్తున్నావు అని అంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ అక్కడ.. డిన్నర్ ఇక్కడ అన్నట్లు అయింది నా పరిస్థితి" అని తెలిపింది మంచు లక్ష్మి.

"పాప స్కూల్ కు మాత్రం అక్కడే వెళ్తోంది. ప్రయోగాల కోసమే ముంబై వెళ్లాను. ఫిల్మ్ మేకర్ గా ఎక్స్పరిమెంట్ చేసేందుకే వెళ్లాను. నిర్మాతగా, యాక్టర్ గా, ఓటీటీ స్టార్ గా సత్తా చాటేందుకు చాలా వర్క్ ఉంది. ఇక్కడ ఉంటే ఇంతే అనుకుంటాం.. కానీ అక్కడికి వెళ్తే ఇన్ని చేయవచ్చా అని కచ్చితంగా అనిపిస్తుంది" అని చెప్పింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మంచు డాటర్ పెద్ద ప్లానే వేసినట్లు ఉందని అంటున్నారు నెటిజన్లు.

అయితే మంచు లక్ష్మి నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపర్వం ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆదిపర్వం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రంలో ఏడు గెటప్స్ లో కనిపించనుంది. అందుకు ఒక్కసారి కూడా డూప్ వాడలేదు. దీంతో ఆమె డెడికేషనేంటో అర్థమవుతోంది. మరి ఈ సినిమాతో మంచు లక్ష్మి ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News