మంచు కన్నప్పకి జోడీ సెట్‌

మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప

Update: 2023-12-15 05:51 GMT

మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రం విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అనే విషయం తెల్సిందే. సుదీర్ఘ కాలంగా విష్ణు ఈ ప్రాజెక్ట్‌ గురించిన చర్చలు జరుపుతున్నాడు. ఎట్టకేలకు సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది. యూనిట్‌ సభ్యులు సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్‌ ను విదేశాల్లో చిత్రీకరిస్తున్నారు.


ఈ సినిమాలో మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, ప్రభాస్‌ ఇంకా ఎంతో మంది టాలీవుడ్‌, బాలీవుడ్‌ పాన్ ఇండియా స్టార్స్‌ గెస్ట్‌ పాత్రల్లో కనిపించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై త్వరలోనే క్లారిటీ వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక కన్నప్ప సినిమాలో లేడీ లీడ్‌ రోల్‌ లో నటించేది ఎవరు అంటూ చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. మొదట ఆ పాత్రకు గాను స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్ సోదరి నుపుర్‌ సనన్‌ ను హీరోయిన్‌ గా నటింపజేసేందుకు చర్చలు జరిపారు. ఆమె డేట్లు ఇవ్వలేని పరిస్థితి నేపథ్యం లో మరో హీరోయిన్‌ ని రంగంలోకి దించబోతున్నారు.

కన్నప్ప సినిమాలో హీరోయిన్‌ గా ప్రీతి ముకుందన్‌ ను నటింపజేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. క్లాసికల్‌ డాన్సర్ అయిన ప్రీతి ముకుందన్‌ మోడలింగ్ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తోంది. ఆమె కన్నప్ప సినిమాకు మంచి ఎంపిక అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

కన్నప్ప షూటింగ్‌ ను విదేశాల్లో చేస్తున్న సమయంలో విష్ణు కు గాయం అయ్యిందనే వార్తలు వచ్చాయి. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగ్ ను విదేశాల్లోనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సినిమాలో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార గెస్ట్‌ రోల్‌ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News