'కన్నప్ప' కోసం అంత దూరం ఎందుకు విష్ణు..!

సినిమా ఇండస్ట్రీలో నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు అందరికి కూడా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ లు ఉంటాయి. చాలా మందికి ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌ చేసే అవకాశం రాకుండానే రిటైర్డ్‌ అవుతారు.

Update: 2023-11-08 12:30 GMT

సినిమా ఇండస్ట్రీలో నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు అందరికి కూడా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ లు ఉంటాయి. చాలా మందికి ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌ చేసే అవకాశం రాకుండానే రిటైర్డ్‌ అవుతారు. కానీ కొద్ది మంది మాత్రం తమ కలను సాకారం చేసుకుంటారు. అందులో మంచు విష్ణు కూడా ఒకరిగా నిలువబోతున్నట్లుగా ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చాలా కాలంగా మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమా ను చేయాలని ఆశ పడుతున్నాడు. ఆయన కెరీర్‌ ఆరంభించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు భక్త కన్నప్ప సినిమా గురించి కలలు కనడం మొదలు పెట్టాడట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్‌ గురించి కొన్ని వందల మందితో చర్చలు జరిపిన మంచు విష్ణు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

మంచు వారి కన్నప్ప సినిమా లో ప్రభాస్, సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్‌ తో పాటు ఇంకా ఎంతో మంది ప్రముఖ స్టార్స్ కనిపించబోతున్నారు. నటీ నటుల విషయం పక్కన పెడితే ఈ సినిమా కోసం మంచు విష్ణు న్యూజిలాండ్ లో ఒక భారీ షెడ్యూల్‌ ను ప్లాన్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది. భారీగా ఖర్చు చేసి మరీ ఆ షెడ్యూల్‌ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తారట.

కన్నప్ప సినిమా కోసం న్యూజిలాండ్ వరకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే కన్నప్ప సినిమాను ఎక్కువగా ప్రకృతి సౌందర్యం మధ్య చిత్రీకరించాల్సి ఉంటుంది. అడవులకు సంబంధించిన అందమైన లొకేషన్స్ కేవలం న్యూజిలాండ్ లో మాత్రమే దొరుకుతాయని మంచు విష్ణు భావిస్తున్నాడట.

అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ తో ఈ సినిమా లోని సన్నివేశాలను అత్యంత సుందరంగా చిత్రీకరించాలని మంచు విష్ణు ఆశ పడుతున్నారు. అందుకే అంత దూరం వెళ్లేందుకు కూడా రెడీ అవుతున్నాడు అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. మొత్తానికి మంచు విష్ణు గత సినిమాల ఫలితాలను గురించి పట్టించుకోకుండా ఈ సినిమా ను భారీ ఎత్తున ఖర్చు చేసి స్వయంగా నిర్మిస్తూ నటించబోతున్నాడు. గత సినిమాల ఫలితాలను మర్చి పోయే విధంగా కన్నప్ప సక్సెస్‌ అయ్యేనా చూడాలి.

Tags:    

Similar News