నిమ్మగడ్డ వల్లే 'మంగళవారం' తో మెగా అనుబంధం!
నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ వేడుక ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మంగళవారం... ప్రస్తుతం ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయడంతో పాటు దర్శక నిర్మాతలకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మంగళవారం కోసం రాబోతున్నాడు.
నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ వేడుక ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రీ రిలీజ్ వేడుక కోసం పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ రాబోతున్నాడు. షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి మరీ మంగళవారం సినిమా కోసం రాబోతున్నట్లుగా యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
అప్పుడు చిరంజీవి, ఇప్పుడు అల్లు అర్జున్ ఈ సినిమా పబ్లిసిటీ కోసం రావడం చాలా మందికి ఆశ్చర్యం ను కలిగిస్తుంది. దర్శకుడు అజయ్ భూపతి గత చిత్రం పెద్దగా ఆడింది లేదు, ఇక హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ కూడా అంతగా ఫామ్ లో ఉన్నట్లుగా అనిపించడం లేదు. అయినా కూడా చిరు, బన్నీ వంటి స్టార్స్ ఈ సినిమా పబ్లిసిటీ కి హెల్ప్ చేయడానికి కారణం ఏంటా అంటూ అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం కోసం చిరు, బన్నీ రావడంకు దర్శకుడు, హీరోయిన్ కారణం కాదు. నిర్మాత అయిన స్వాతి గునుపాటి. ఈమె కి చిరంజీవి చిన్న కూతురు శ్రీజ క్లోజ్ ఫ్రెండ్. అందుకే చిరంజీవి మంగళవారం సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే తెలుగు వారందరికీ కూడా సుపరిచితుడు అయిన ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కి స్వాతి కూతురు.
నిమ్మగడ్డ ప్రసాద్ తో మెగాస్టార్ చిరంజీవికి మరియు అల్లు అరవింద్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కారణం వల్ల కూడా స్వాతి మొదటిసారి నిర్మాతగా మారి నిర్మించిన మంగళవారం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో చిరంజీవి, అల్లు అర్జున్ లు పాల్గొంటున్నారు. అల్లు అర్జున్ మాత్రమే కాకుండా ముందు ముందు నిమ్మగడ్డ తో సన్నిహిత్యం ఉన్న వారు చాలా మందే మంగళవారం కోసం మీడియా ముందుకు వచ్చిన ఆశ్చర్యం లేదు. చిన్న సినిమాకు పెద్ద పబ్లిసిటీ దక్కడంతో ఏ స్థాయి లో ఈ సినిమాకు అది వర్కౌట్ అయ్యేనో చూడాలి.