మంగళవారం : మైనస్ అనుకున్నదే ప్లస్ అయ్యిందా!
పాయల్ రాజ్ పూత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
పాయల్ రాజ్ పూత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందని, అలాగే హీరోయిన్ పాత్ర ను దర్శకుడు చూపించిన తీరు, కథ లో ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ను చక్కగా చూపించారు.
దర్శకుడు అజయ్ భూపతి ఇలాంటి కథను ఎంపిక చేసుకోవడం సాహసం అనుకోవాలి. తెలుగు లో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేస్తే ఆధరిస్తారు అనే నమ్మకంను కనబర్చిన నిర్మాతను కూడా అభినందించాల్సిందే. హీరోయిన్ శైలు కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులు జీర్ణించుకోవడం కష్టం అని చాలామంది అన్నారట.
ఆ సన్నివేశాలు సినిమాలో లేకపోవడం ఉత్తమం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారట. కానీ దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఆ సన్నివేశాలు ఉండాల్సిందే అని పట్టుబట్టి మరీ ఉంచాడట. టెన్షన్ తోనే సినిమాను విడుదల చేయడం జరిగిందట. ఇప్పుడు ఆ సన్నివేశాలకే మంచి స్పందన వస్తుందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆ సన్నివేశాల్లో పాయల్ నటన విషయంలో ఏమాత్రం తడబడినా కూడా మొత్తం ఫలితం తలకిందులు అయ్యేది. ఆ సన్నివేశాలు సినిమాకు పెద్ద మైనస్ అయ్యేవి అనడంలో సందేహం లేదు అంటూ రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాయల్ నటన మరియు దర్శకుడు అజయ్ భూపతి చాలా సున్నితంగా ఆ సన్నివేశాలను చూపించడం వల్లే మంగళవారం కి ప్లస్ అయ్యాయి. సినిమా గురించి జనాలు పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు.