IFFI- 2024లో మ‌ణిర‌త్నం ఫిలింమేకింగ్ క్లాస్!

"సినిమా మేకింగ్‌లో ద‌ర్శ‌కుడు ఎప్పుడూ సమర్ధవంతంగా ఉండాలి. కొన్నిసార్లు ప్రమాదాలు అద్భుతంగా ఉంటాయి" అని అన్నారు స్టార్ ఫిలింమేక‌ర్ మ‌ణిర‌త్నం

Update: 2024-11-23 23:30 GMT

``సినిమా మేకింగ్‌లో ద‌ర్శ‌కుడు ఎప్పుడూ సమర్ధవంతంగా ఉండాలి. కొన్నిసార్లు ప్రమాదాలు అద్భుతంగా ఉంటాయి`` అని అన్నారు స్టార్ ఫిలింమేక‌ర్ మ‌ణిర‌త్నం. ``సెట్లో ఉన్న‌ప్పుడు ఫిలింమేక‌ర్ ముందే ప్లాన్ చేయ‌క‌పోతే.. మ‌న‌కు పూర్తిగా భిన్నమైన దృక్పథాన్ని ఇస్తుంద‌ని,. ఒక దర్శకుడు ఎలాంటి సంకోచం లేకుండా ప్రతిదాన్ని అరువుగా తీసుకుంటాడ``ని కూడా వ్యాఖ్యానించారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ 2024) వేదిక‌గా మాస్టర్‌క్లాస్‌లో మణిరత్నం బ్లాక్ బ‌స్ట‌ర్ హిస్టారికల్ ఎపిక్ `పొన్నియిన్ సెల్వన్` మేకింగ్ విధానం గురించి చాలా విష‌యాలు చెప్పారు.

కల్కి కృష్ణమూర్తి 1950ల నాటి తమిళ నవల ఆధారంగా రెండు-భాగాల చారిత్రక ఇతిహాసం `పొన్నియిన్ సెల్వన్`ని రూపొందించిన మ‌ణిరత్నం.. కథలలో ప్రామాణికత గురించి నొక్కిచెప్పారు. ఇది నిజంగా జరిగినట్లుగా కనిపించాలని మేం కోరుకుంటున్నాం. ఈ క‌థ‌ను కేవలం సెట్ లేదా స్టూడియోలో చిత్రీకరించలేను.. సూర్యకాంతి, ధూళి, చెమట స‌హ‌జంగా ఉండాలి.. ఆ కాలంలో మీరు ఉన్నారని ప్రేక్ష‌కులు భావించాలి`` అని అన్నారు. చోళుల కాలం నాటి పీరియడ్ డ్రామాను చిత్రీకరించడంలో ఉన్న ప్రాక్టిక‌ల్ సవాళ్లను మ‌ణిరత్నం ముచ్చ‌టించారు. ``ఈరోజు మ‌నం తంజావూరు వెళితే కోటలు దొరకవు.. రాజభవనం లేదు.. ఏమీ మిగలలేదు. కాబట్టి మేం ఉత్తర భారతదేశంలోని ఒక ప్యాలెస్‌లో సినిమాని చిత్రీకరించాము. దానిని మరింత సౌత్ ఇండియన్ లుక్ లోకి మార్చడానికి ఆర్కిటెక్చర్‌ను డిజిటల్‌గా మార్చాము`` అని రత్నం వివరించారు.

ప్ర‌జ‌ల‌కు తెలిసిన సాహిత్యం నుంచి క‌థ‌ను ఎంచుకుంటే ఒత్తిడి ఉంటుంద‌ని మ‌ణిర‌త్నం అంగీకరించారు. ప్రతి పాత్ర ఎలా ఉండాలనే దానిపై ప్రతి ఒక్కరికి స్వీయ‌ దృష్టి ఉంటుంది. నేను కేవలం ఐదు-వాల్యూమ్‌ల పుస్తకంపైనే కాకుండా దాని పట్ల మక్కువ ఉన్న చాలా మంది పాఠకుల అవగాహన ఏమిట‌న్న‌దానిపైనా పోరాడాల్సి వ‌చ్చింది. కానీ ఉద్వేగభరితమైన పాఠకులలో నేను కూడా ఒకడిని గ‌నుక అదే మార్గ‌ద‌ర్శ‌నం ఇస్తుంద‌ని భావించాను అని మ‌ణిర‌త్నం తెలిపారు.

సినిమాటోగ్రాఫర్ ర‌త్నంతో క‌లిసి ప‌నిచేయ‌డంపై మాట్లాడుతూ.. ``సినిమా తీస్తున్నప్పుడు మీ DOP మీకు అత్యంత సన్నిహిత వ్యక్తి అవుతాడు.. నేను స్క్రిప్ట్‌ను కాకుండా నాకు ఏదైనా ఆలోచన ఉన్నప్పుడు వీలైనంత త్వరగా వాటిని విజువ‌లైజ్ చేయ‌డానికి ప్రయత్నిస్తాను.. డివోపీతో ప్రయాణం కలిసి సాగుతుంది..`` అని మ‌ణిర‌త్నం అన్నారు.

స్వ‌ర‌క‌ర్త‌, ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ గురించి మాట్లాడుతూ..``దర్శకుడికి బాగా సహకరించే స్వరకర్త రెహమాన్. సంగీతం అతనిది.. కానీ శైలి, ఎంపికలు, దృశ్యం తాలూకా పార్శ్వ వీక్షణను తీసుకునే సామర్థ్యం ద‌ర్శ‌కుడికి ఉండాలి. అతడు సన్నివేశంలోని క్షణాలను తప్పనిసరిగా అండర్ లైన్ చేయడు.. కానీ అతడు క్రింద ఉన్న పొరలో ఏదైనా చేయగలడు... అని తెలిపారు. మ‌ణిర‌త్నం ఇంకా 24 శాఖ‌ల గురించి మాస్ట‌ర్ క్లాస్ లో చాలా సంగ‌తులు వివ‌రించారు.

Tags:    

Similar News