హిట్ సినిమా స్పీడ్ కి పీవీఆర్ ఐనాక్స్ బ్రేక్!
ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన మాలయణ అనువాద చిత్రం `మంజమ్మల్ బాయ్స్` థియేటర్లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన మాలయణ అనువాద చిత్రం `మంజమ్మల్ బాయ్స్` థియేటర్లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు లో రిలీజ్ చేయడంతో పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. తొలి షోతోనే సినిమా బాగుందనే మౌత్ టాక్ రావడంతో జనాలంతా థియేటర్ల వద్ద క్యూ కట్టారు. ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ఇప్పటికీ హౌస్ పుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. అందులోనూ మెట్రోపాలిటన్ సిటీస్ లో సినిమాకి విశేష ఆదరణ దక్కుతోంది.
అయితే ఉన్నపళంగా తెలుగు రాష్ట్రాల్లో పీవీర్ ఐనాక్స్ లో ఈసినిమా ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఆ తాము రిలీజ్ చేసిన సినిమాని ఎలా నిలిపివేస్తారని పీవీఆర్ పై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి అసహనం వ్యక్తం చేసారు. మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్థాంతరంగా ఆపేయడం అన్యాయమని మండిపడ్డారు. ఉన్న పళంగా ప్రదర్శనలు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు.
ఈ వివాదాన్ని- పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారశైలిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై ఈ రోజు సాయంత్రం అత్యవసర సమావేశం కానుంది. ఛాంబర్ తో సమావేశం అనంతరం రిలీజ్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా పీవీఆర్ ఐనాక్స్ నిలిపివేత అనంతరం ప్రేక్షకుకులు ఇబ్బందికి గురవుతున్నారు.
సినిమా ఆపేసారు? అన్న సంగతి తెలియక చాలా మంది థియేటర్ వద్దకు వచ్చి వెనుదిరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే పీవీఆర్ -మంజమ్మల్ బోయ్స్` నిర్మాత మధ్య వివాదం ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది. పీవీఆర్ ఐనాక్స్ దేశ వ్యాప్తంగా స్క్రీన్లను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. మంజమ్మల్ బాయ్స్ ఫిబ్రవరిలో మలయాళంలో రిలీజ్ అయింది.