గుంటూరు కారం కోసం థమన్ మధ్యవర్తిత్వం!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల చాలా మార్పులు చేర్పులు జరిగిన విషయం తెల్సిందే

Update: 2023-10-27 15:30 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల చాలా మార్పులు చేర్పులు జరిగిన విషయం తెల్సిందే. ఏకంగా హీరోయిన్ పూజా హెగ్డే ను కూడా తప్పించిన విషయం తెల్సిందే. పలు కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన గుంటూరు కారం కు సంబంధించిన కీలక మార్పు సినిమాటోగ్రాఫర్‌.

సినిమా ప్రారంభం సమయంలో ఉన్న టెక్నీషియన్స్ మరియు నటీ నటుల్లో చాలా మంది ఇప్పుడు లేరు. అందులో ఒకరు సినిమాటోగ్రాఫర్‌ పి ఎస్ వినోద్‌. ఈయన ఏవో కారణాల వల్ల సినిమా నుంచి మధ్యలో తప్పుకున్నారు. సాధారణంగా ఒక ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ మధ్యలో వదిలేసిన ఏ సినిమాను కూడా ఇతర స్టార్‌ టెక్నీషియన్స్‌ కమిట్ అవ్వరు. కానీ గురంటూరు కారం కోసం మరో స్టార్ సినిమాటోగ్రాఫర్ వచ్చారు.

తమిళ్‌ తో పాటు తెలుగు లో ఎన్నో సూపర్ హిట్ సినిమా లకు తన సూపర్ కెమెరా పనితనం అందించిన మనోజ్‌ పరమహంస ను ఈ సినిమా కోసం తీసుకు రావడం జరిగింది. ఆయన ఉన్న బిజీకి మధ్య లో ఉన్న సినిమా ను టేకోవర్ చేయడం నిజంగా గొప్ప విషయం అంటూ చాలా మంది మట్లాడుకుంటున్నారు. ఆయన గుంటూరు కారం కమిట్ అవ్వడానికి థమన్ కారణంగా తెలుస్తోంది.

ఆ మధ్య మనోజ్‌ పరమహంస ఒక చిట్‌ చాట్ లో స్వయంగా ఆ విషయంను వెళ్లడించాడు. సుదీర్ఘ కాలం గా థమన్‌ తో తనకు ఉన్న అనుబంధం తో గుంటూరు కారం సినిమా ను టేకోవర్‌ చేయాలంటూ అడిగిన సమయంలో కాదనలేక పోయాను అన్నాడు. అయితే అప్పటికే కమిట్ అయిన సినిమాల విషయం లో కాస్త ఇబ్బంది తలెత్తుతుందేమో అనుకున్నా కూడా మొత్తం సెట్‌ అయిందని ఆయన పేర్కొన్నాడు.

థమన్‌ మాట్లాడటం వల్లే మనోజ్‌ వంటి స్టార్ టెక్నీషియన్‌ ఈ సినిమాకు వర్క్ చేసేందుకు ఒప్పుకున్నాడు. ఒక వేళ థమన్‌ తనకెందుకు లే అనుకుంటే.. మధ్యవర్తిత్వం చేయకుంటే కచ్చితంగా గుంటూరు కారం ఈ విషయం లో సమస్యలు ఎదుర్కొనేది. మరో ఇద్దరు ముగ్గురు సినిమాటోగ్రాఫర్స్ అయినా ఈ సినిమా కు వర్క్‌ చేయాల్సి వచ్చేది అనేది సినీ విశ్లేషకులు అభిప్రాయం.

Tags:    

Similar News