ఓటీటీలోనూ ఆ సినిమా సంచ‌ల‌న‌మ‌య్యేనా?

థియేట‌ర్లో ఆ రేంజ్ లో హార‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు.

Update: 2024-08-25 06:07 GMT

ఇటీవ‌ల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `మూంజ్యా` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. 100 కోట్ల వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యంగా నిలిచింది. స్టార్ హీరోల సినిమాలే బోల్తా కొట్టిన రోజుల్లో `మూంజ్యా` వ‌సూళ్లు బాలీవుడ్ ని సైతం స‌ర్ ప్రైజ్ చేసాయి. థియేట‌ర్లో ఆ రేంజ్ లో హార‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది.

స్టార్ గోల్డ్ లో గ‌త రాత్రి ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌గా స్రీమింగ్ అయింది. అయితే హిందీలో మాత్రం అందుబాటులో లేదు. దీంతో డిస్నీ హాట్ స్టార్ ప్రత్యేకంగా హిందీలో చలన చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తుంది. థియేట‌ర్లో చూడ‌ని వారంతా హాట్ స్టార్ లో ఎంచ‌క్కా వీక్షించవ‌చ్చు. మ‌రి ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి. థియేట‌ర్లో హిట్ అయిన సినిమాలకు ఓటీటీలోనూ మంచి డిమాండ్ ఉంటుంది.

హిట్ కాని చాలా సినిమాలు కూడా ఓటీటీలో మంచి ఆద‌రణ‌కు నోచుకుంటున్నాయి. అయితే కంటెంట్ అన్న‌ది కీల‌కం. కంటెంట్ ఉంటే థియేట‌ర్ ఆడియ‌న్స్ ని మెప్పించ‌క‌పోయినా ఓటీటీ ప్రేక్ష‌కుల్ని మెప్పించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్ప‌టికే అలాంటి సినిమాలెన్నో ఉన్నాయి. ఓటీటీ డిమాండ్ అలాగే పెరిగింది. అందుకే కంటెంట్ బేస్ట్ చిత్రాలు ఎక్కువ‌గా ఓటీటీ రిలీజ్ కే ఆస‌క్తి చూపిస్తున్నాయి.

మూంజ్యా థియేట‌ర్లో రిలీజ్ అయిన‌ప్పుడు ఎలాంటి అంచ‌నాలు లేవు. ఇప్పుడు హిట్ అనే బ‌జ్ క్రియేట్ అయింది కాబ‌ట్టి ఓటీటీలో జ‌నాలు ఎగ‌బ‌డి చూసే అవ‌కాశం ఉంది. శర్వరి వాఘ్, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో ఆదిత్య సర్పోత్దార్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. మడాక్ ఫిల్మ్స్ నిర్మించింది.

Tags:    

Similar News