విశాల్ కెరీర్ లో ఫస్ట్ సెంచరీ ఇదే
కోలీవుడ్ హీరో విశాల్ ఇంతవరకూ సెంచరీ కొట్టింది లేదు. వైవిథ్యమైన సినిమాలు...డిఫరెంట్ పాత్రలతో ఎన్నో సినిమాలతో మెప్పించిన విశాల్ ఇంకా 100 కోట్ల క్లబ్ లో చేరలేదు
కోలీవుడ్ హీరో విశాల్ ఇంతవరకూ సెంచరీ కొట్టింది లేదు. వైవిథ్యమైన సినిమాలు...డిఫరెంట్ పాత్రలతో ఎన్నో సినిమాలతో మెప్పించిన విశాల్ ఇంకా 100 కోట్ల క్లబ్ లో చేరలేదు. తెలుగు..తమిళ్ లో మార్కెట్ ఉన్న హీరో అయినా ఇంతవరకూ అది సాధ్యం కాకపోవడం అన్నది ఆశ్చర్యకరమైన అంశమే. కోలీవుడ్ లో కంటెంట్ ఉన్న సినిమాలు సైతం 100 కోట్లను సాధించాయి.
కానీ విశాల్ లాంటి కటౌట్ ఖాతాలో ఇంకా 100 కోట్లు నమోదు అవ్వలేదు అంటే? ఒకింత ఆశ్చర్యానికి గురవ్వాల్సిన విషయమే. అయితే ఇక ఆ సమస్యలేదు. తాజాగా 'మార్క్ ఆంటోనీ'తో విశాల్ ఆ ఫీట్ కి అతి చేరువలో ఉన్నాడు. తమిళంలో అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్‌గా రూ. 100 కోట్ల మార్క్ గ్రాస్‌ను అందుకునే అవకాశం కనిపిస్తోంది.
ఈ సినిమాకు ఇప్పటికే తెలుగులో రూ. 4.17 కోట్లు రాబట్టింది. 16 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే.. తమిళనాడులో రూ. 59.60 కోట్లు.. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.95 కోట్లు.. ఓవర్సీస్‌లో రూ. 17. 90 కోట్లతో మొత్తంగా రూ. 96.25 కోట్లు గ్రాస్.. రూ. 47.55 కోట్ల షేర్ వసూళు లెక్కలోకి వచ్చాయి. అయితే ఈ లెక్క రెండు...మూడు రోజుల క్రితంది. సక్సెస్ టాక్ నేపథ్యంలో తాజా లెక్కలు కూడా చూస్తే 100 కోట్లను సునాయాసంగా దాటేసి ఉంటుందని అంచనాలు తెరపైకి వస్తున్నాయి.
దీంతో విశాల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో కూడా వంద కోట్ల క్లబ్ లోకి చేరాడంటూ విషెస్ తెలియజేస్తున్నారు. అయితే ఆ లెక్కలు అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. ఎస్ వినోద్ కుమార్ 30 కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వరల్డ్ వైడ్‌గా రూ. 40 కోట్లుగా నమోదు అయింది. ఈ సినిమాను వరల్డ్ వైడ్‍గా 2900 స్క్రీన్లలో విడుదల చేశారు. అయితే ఏపీ-తెలంగాణలో 500 థియేటర్లు కేటాయించగా..' స్కంద'..' చంద్రముఖి 2' సినిమాలతో థియేటర్ల సంఖ్య భారీగా తగ్గింది.