ప్రాఫిట్ వచ్చేలా మాస్ హీరో రీమేక్ ప్లాన్

నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ వచ్చే విధంగా డైరెక్టర్ హీరో పారితోషకాలు సినిమా బడ్జెట్ అంతా కూడా ముందుగానే ఫిక్స్ చేసుకున్నారు.

Update: 2023-12-06 04:20 GMT

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరొక సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఆ ప్రాజెక్టు మొదలుపెట్టడానికి అంతా సిద్ధం చేసుకున్నారు.

కానీ చివరికి బడ్జెట్ విషయంలో కొన్ని కారణాల వలన సినిమాను ఆపేయాల్సి వచ్చింది. 120 కోట్ల వరకు బడ్జెట్ అవుతూ ఉండడంతో రిస్క్ అని నిర్మాతలు ఆ ప్రాజెక్టు నుంచి హోల్డ్ లో పెట్టారు. దీంతో రవితేజ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకొని పీపుల్స్ వీడియో ఫ్యాక్టరీలో కొత్త ప్రాజెక్టు చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దర్శకుడిగా హరీష్ శంకర్ ఫిక్స్ అయ్యాడు.

మొదట వీరు ఒక కొత్త తరహా కధ చేయాలని అనుకున్నారు. కానీ మళ్ళీ వెనక్కి తగ్గి రీమేక్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. అయితే ముందుగా బడ్జెట్ ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాతనే రీమేక్ ప్లాన్ చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ వచ్చే విధంగా డైరెక్టర్ హీరో పారితోషకాలు సినిమా బడ్జెట్ అంతా కూడా ముందుగానే ఫిక్స్ చేసుకున్నారు.

డైరెక్టర్ హీరో పారితోషకం 40 కోట్లు కాగా బడ్జెట్ మరొక 40 కోట్లుగా ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి విడుదల చేయాలని అనుకుంటూ ఉన్నారు. హిందీలో అజయ్ దేవగన్ నటించిన రెయిడ్ సినిమాకు ఇది రీమేక్ అని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి తగ్గట్టుగా స్క్రిప్టును దర్శకుడు సరికొత్తగా మారుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఉత్తరప్రదేశ్లో ఒక షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు. రవితేజ ఏమాత్రం సమయం వృధా చేయకుండా మూడు నెలలోనే సినిమాను ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్లో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజా ది గ్రేట్ లాంటి మంచి సక్సెస్ ఇచ్చిన అనిల్ రావిపూడి తో ఆ ప్రాజెక్టు ఉండబోతోంది. అలాగే రవితేజ మరో రెండు ప్రాజెక్టులను కూడా త్వరలో ఓకే చేసే పనిలో ఉన్నాడు.

Tags:    

Similar News