రవితేజకు రెమ్యునరేషన్ లేదు, కానీ..
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా దూసుకెళ్తున్నారు
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా దూసుకెళ్తున్నారు. 2023 మొదట్లో చిరంజీవి వాల్తేరు వీరయ్యలో గెస్ట్ రోల్ లో అలరించిన రవితేజ.. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర మూవీలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అవి నిరాశపరిచాయి. ఇటీవలే ఆయన నటించిన ఈగల్ సినిమా.. సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నా వచ్చే నెలకు వాయిదా పడింది.
ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే రవితేజ రెమ్యునరేషన్... ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా మూవీ మూవీకి రెమ్యునరేషన్ ను రవితేజ పెంచేస్తున్నారట.
రెండేళ్ల క్రితం ఓ సినిమాకు రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్న రవితేజ.. ఇప్పుడు రూ.30 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అయితే రవితేజ అడిగిన పారితోషకం ఇవ్వలేకే గోపీచంద్ తో చేయాల్సిన సినిమా ఆగిపోయిందట. రూ.30 కోట్లు ఇవ్వలేమని మైత్రీ మూవీ మేకర్స్ చేతులెత్తేసి ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టిందట.
తాజాగా రవితేజ అప్ కమింగ్ మూవీ మిస్టర్ బచ్చన్ కోసం ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండానే ఆ సినిమా చేస్తున్నారట రవితేజ. కేవలం హీరోనే కాదు.. హరీశ్ శంకర్ కూడా పారితోషకం తీసుకోకుండానే చేస్తున్నారట. వీళ్లద్దరికి సినిమా లాభాల్లో వాటా దక్కుతుందట. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయితే.. రవితేజ, హరీశ్ శంకర్ కు లాభాల పంటే.
ఈ సినిమా షూటింగ్ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేయాలని మేకర్స్.. టార్గెట్ గా పెట్టుకున్నారట. ఎక్కువ భాగం షూటింగ్ ను సెట్స్ లోనే పూర్తి చేయాలనుకుంటున్నారట. మేకింగ్ తో పాటు రెమ్యునరేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే.. శాటిలైట్, డిజిటల్ రైట్స్ తోనే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ దక్కించుకోవచ్చు.
ఇక రవితేజ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మార్కెట్ స్ట్రాంగ్ గా లేనప్పుడు.. ఇదే కరెక్ట్ అని సమర్థిస్తున్నారు. మరి ఈ మూవీ రిలీజ్ అయ్యాక రవితేజ ఎంత ఆర్జిస్తారో చూడాలి.