ఫోటో స్టోరి: అన్న‌య్య చెవిలో త‌మ్ముడు ఏంటా గుస‌గుస‌?

అన్న‌య్య చెంత‌నే ఉన్న ర‌వితేజ వేదిక వ‌ద్ద‌ అలా చెవిలో ఏవో గుస‌గుస‌లు ఆడేస్తున్నారు.

Update: 2023-08-09 04:23 GMT

ప‌రిశ్ర‌మ‌లో మెగాస్టార్ చిరంజీవి ఎంద‌రో హీరోలు న‌టీన‌టుల‌ను ఎంకరేజ్ చేసారు. వారి కెరీర్ ఎదుగుద‌ల‌లో మెగాఫ్యాన్స్ పాత్ర విస్మ‌రించ‌లేనిది. అందులో క‌చ్ఛితంగా మాస్ మ‌హారాజా ర‌వితేజ ఒక‌రు. నేడు 10కోట్లు పైగా పారితోషికం అందుకునే అగ్ర హీరోగా ఎదిగాడు అత‌డు. ఇక చిరును అన్న‌య్యా అంటూ ఆప్యాయంగా పిలుచుకునే గొప్ప అభిమానిగా ర‌వితేజ ఎంతో స‌న్నిహితుడు.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'వాల్తేరు వీర‌య్య‌'లో ర‌వితేజ పాత్ర అల్టిమేట్ హిట్. అన్న‌య్య అలాంటి అవ‌కాశం క‌ల్పిస్తే తాను ఏ రేంజులో చెల‌రేగిపోతాడో నిరూపించాడు మాస్ రాజా. 'వాల్తేరు వీర‌య్య‌'కు ర‌వితేజ పాత్ర ప్ర‌ధాన అస్సెట్ అంటూ స‌మీక్ష‌కులు సైతం ప్ర‌శంసించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 200కోట్ల క్ల‌బ్ లో చేరడ‌మే గాక 200 రోజులు ఆడింది.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స్పెష‌ల్ డే సెల‌బ్రేష‌న్స్ లో అన్న‌య్య చెంత‌నే ఉన్న ర‌వితేజ వేదిక వ‌ద్ద‌ అలా చెవిలో ఏవో గుస‌గుస‌లు ఆడేస్తున్నారు. ఇంత‌కీ ఈ గుస‌గుస‌లు దేనికోసం.. ? అన్న‌య్య‌కు ర‌వితేజ ఏం చెబుతున్నారు? అంటూ అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది.

అన్న‌ట్టు అన్న‌ద‌మ్ములిద్ద‌రూ క‌లిసి మళ్లీ న‌టించేది ఎప్పుడు? వాల్తేరు వీర‌య్య సీక్వెల్ గురించి ఆలోచ‌న ఏదైనా ఉందా? ఈ ప్ర‌శ్న‌ల‌కు ఆ ఇద్ద‌రి నుంచే స‌మాధానం రావాల్సి ఉంది. అన్న‌ద‌మ్ములు మళ్లీ మ‌ళ్లీ క‌లిసి న‌టిస్తే చూడాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆ ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లిస్తే మాస్ లో దుమ్ము దుమార‌మే. ఈసారి ఆ ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌స్తుత పాన్ ఇండియా ట్రెండ్ లో దూసుకెళ‌తారేమో వేచి చూడాలి. చిరు న‌టించిన రీమేక్ మూవీ భోళాశంక‌ర్ ఆగ‌స్టు 11న విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అక్టోబ‌ర్ లో విడుద‌ల కానుంది.

Tags:    

Similar News