స్టార్ హీరో సంపాద‌న‌లో 70శాతం ప్ర‌జాసేవ‌కే

ది మ్యాట్రిక్స్ చిత్రాలలో న‌టించేప్పుడు తన కాలంలో కీను దాతృత్వ స్వ‌భావంతోను అభిమానులను కూడా ఆకట్టుకున్నాడు.

Update: 2024-11-03 09:30 GMT

ఆ హీరో మ‌రెవ‌రో కాదు సంచ‌ల‌నాల 'మ్యాట్రిక్స్' స్టార్ కీను రీవ్స్. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ స్టార్ల‌లో కీనూ ఒక‌రు. నిజానికి మ‌న స్టార్లు డైలాగుల‌తోనే స‌గం సినిమాని నింపేస్తారు కానీ అస‌లు డైలాగ్ తో ప‌ని లేకుండా న‌టించ‌డం ఎలానో నేర్పించిన స్టార్ కీను రీవ్స్. డైలాగుల‌తో అన‌వ‌స‌రంగా శ‌బ్ద కాలుష్యాన్ని సృష్టించ‌ని స్టార్ అత‌డు. ప్ర‌ముఖ స్క్రీన్ ప్లే నిపుణుల విశ్లేష‌ణ ప్ర‌కారం.. ఏదైనా సినిమాలో ఎంత త‌క్కువ డైలాగులు ఉండి, అంత బెస్ట్ విజువ‌లైజేష‌న్ ఉంటే అది అంత గొప్ప‌ ఉత్త‌మమైన సినిమాగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. కానీ మ‌న తెలుగు సినిమాల శైలి అందుకు భిన్న‌మైన‌ది. కానీ బాహుబ‌లి త‌ర్వాత విజువ‌లైజేష‌న్ ప్ర‌క్రియ అస‌మానంగా రూపు దిద్దుకుంటోంది. దీంతో హాలీవుడ్ ప్ర‌మాణాలు ఆవిష్కృత‌మ‌వుతున్నాయి.

కీనూ రీవ్స్ సినిమా మొత్తంలో కేవలం 638 పదాలు మాత్రమే మాట్లాడే పాత్రను పోషించాడు. అయినా కానీ అతడు దాని కోసం అత్యధిక పారితోషికం పొందిన స్టార్ గా నిలిచాడు. ది మ్యాట్రిక్స్ (రీలోడెడ్ మరియు రివల్యూషన్స్)కి వాచోవ్‌స్కిస్ సంచలనాత్మక రెండు-భాగాల సీక్వెల్‌లో కీను రీవ్స్ నియోగా అనే తన పాత్రను తిరిగి పోషించాడు. మొదటి సినిమా విజయంతో కీనూ స్టార్ పవర్ పెరిగింది. అతను భారీ పారితోషికం తీసుకున్నాడు. కీను రెండు చిత్రాల ఉమ్మడి నిర్మాణం కోసం 100 మిలియన్ డాల‌ర్లు తీసుకున్నాడు. అతడు రెండు చిత్రాలలో వంద లైన్ల కంటే తక్కువ డైలాగ్‌లను కలిగి ఉన్నందున, ఒక లైన్‌కి లేదా పదానికి 1,59,000 డాల‌ర్లు సంపాదించాడు. సినీ చరిత్రలో మరే నటుడూ ఇంత పారితోషికం తీసుకోలేదు.

ది మ్యాట్రిక్స్ చిత్రాలలో న‌టించేప్పుడు తన కాలంలో కీను దాతృత్వ స్వ‌భావంతోను అభిమానులను కూడా ఆకట్టుకున్నాడు. మొదటి చిత్రంతో అతడు 45 మిలియన్ డాల‌ర్ల‌కు పైగా సంపాదించాడు. తరువాత అతడు దానిలో 70 శాతం విరాళంగా ఇచ్చాడని క‌థ‌నాలొచ్చాయి. కీను మ్యాట్రిక్స్ 2 -మ్యాట్రిక్స్ 3 VFX బృందానికి మిలియన్ల డాలర్ల విలువైన బహుమతులను కూడా అందించాడు. అతడు తన ఇటీవలి హిట్ అయిన జాన్ విక్ 4 స్టంట్ టీమ్‌కి ఖరీదైన గడియారాలను బహుమతులుగా ఇచ్చాడు. కీనూ ప్రపంచంలోని అతిపెద్ద పరోపకారిలో ఒకడిగా గొప్ప ఖ్యాతిని ఘ‌డించారు.

ఈ జ‌న‌రేష‌న్ స్టార్ల త‌ర‌హాలోనే కీను రీవ్స్ కూడా రెండు భాగాలుగా తెర‌కెక్కే చిత్రాలలో న‌టిస్తూ తన పారితోషికాన్ని భారీగా వసూలు చేస్తాడు. ముందస్తు అడ్వాన్సుల‌తో పాటు, బాక్సాఫీస్ కలెక్షన్ల నుండి బోనస్ అందుకుంటాడు. స్క్రీన్ రాంట్ వివ‌రాల ప్రకారం జాన్ విక్ 4 కోసం 15 మిలియన్ డాల‌ర్ల‌ను ముందుగానే తీసుకున్నాడు. అద‌నంగా బోనస్ చెల్లింపును కూడా లెక్కించిన తర్వాత కీను చిత్రంలో తన పాత్ర కోసం మొత్తం 25 మిలియన్ డాల‌ర్ల‌ను పొందాడు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా నిలిచాడు. అత్యధిక పారితోషికం పొందుతున్న భారతీయ తారలతో పోల్చితే అత‌డు చాలా ఎత్తున ఉన్నాడు. షారూఖ్ ఖాన్, ప్రభాస్, సల్మాన్ ఖాన్ వంటి టాప్ స్టార్లు ఈరోజు ఒక్కో సినిమాకు 12 మిలియ‌న్ల డాల‌ర్ల‌ నుండి 18 మిలియన్ల డాల‌ర్లు (రూ.100-150 కోట్లు) సంపాదిస్తున్నారు. కేవలం ఇద్దరు తమిళ స్టార్లు - రజనీకాంత్, విజయ్ - భారతీయ నటులందరిలో కీను కంటే ఎక్కువ సంపాదించారని ఇటీవ‌ల క‌థ‌నాలు రావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వారు ఒక్కో సినిమాకి 150-200 కోట్లు అందుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

2025లో కీను వ‌రుస చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు. అనా డి అర్మాస్-నటించిన స్పిన్‌ఆఫ్ 'ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ జాన్ విక్: బాలేరినా'లో అతిధి పాత్రలో జాన్ విక్ పాత్రను తిరిగి పోషిస్తున్నారు. ఆ తర్వాత మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. గుడ్ ఫార్చూన్ అండ్ రిజ‌ల్ట్.. డిసెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న యానిమేటెడ్ ఆంథాలజీ సిరీస్ లోని ఒక ఎపిసోడ్‌లో ఒక పాత్రకు గాత్రదానం చేయనున్నాడు.

Tags:    

Similar News