ఆ హీరోయిన్ల రూట్ ఫాలో అవుతున్న మీనాక్షి చౌదరి.. ఫలితం దక్కుతుందా..

ఇప్పుడు ఈ హీరోయిన్ల రూట్ లోనే మీనాక్షి చౌదరి కూడా ఒకే సీజన్లో.. ప్రేక్షకులను వరుస సినిమాలతో పలకరించడానికి సిద్ధపడుతుంది.

Update: 2024-09-24 21:30 GMT

స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా చేయడం కష్టంగా ఉంటే కొందరు హీరోయిన్లు మాత్రం సీజన్ కి రెండు సినిమాలు చొప్పున చేస్తూ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. శృతిహాసన్ లాంటి హీరోయిన్లు పండగ సీజన్ వచ్చిందంటే రెండు మూడు సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ హీరోయిన్ల రూట్ లోనే మీనాక్షి చౌదరి కూడా ఒకే సీజన్లో.. ప్రేక్షకులను వరుస సినిమాలతో పలకరించడానికి సిద్ధపడుతుంది.

సినీ ఇండస్ట్రీలో పండగ సీజన్ వచ్చింది అంటే కచ్చితంగా స్టార్ హీరోలో సినిమాలు పడాల్సిందే. లేకపోతే పండగ మజా ఉండనట్టే అంటారు సినీ లవర్స్. మరి సంక్రాంతి కైతే బాలకృష్ణ, మెగాస్టార్ చిత్రాలు విడుదల కావాల్సిందే. తాజాగా ఈ జాబితాలోకి నాగార్జున, వెంకటేష్ కూడా చేరిపోయారు. చాలా సందర్భాలలో ఈ సినిమాలలో హీరోయిన్లు ఒకరే ఉంటారు. తాజాగా విడుదలైన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డిలో శృతిహాసన్ హీరోయిన్గా నటించి మాంచి క్రెడిట్ దక్కించుకుంది. ఇంతకుముందు సంక్రాంతికి కూడా ఈ ఇద్దరూ ఒకేసారి చిత్రాలు విడుదల చేస్తే సిమ్రాన్ ఈ రెండు సినిమాలలో హీరోయిన్గా చేసి పిచ్చ పాపులర్ అయింది.

ప్రస్తుతం మీనాక్షి చౌదరి కూడా ఇదే రూట్ ఫాలో కాబోతోంది. ఈనెల ఫిబ్రవరిలో రవి తేజ ఈగల్, సైరన్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అనుపమ ఆ నెక్స్ట్ మంత్ సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సౌత్ లో పెద్దగా సినిమాలు లేకపోవడంతో మెల్లిగా నార్త్ లో సెటిల్ అవుతున్న తమన్నా కూడా ఇదే మాదిరిగా డబల్ ధమాకా అందుకుంది. ఆమె నటించిన వేద, స్త్రీ 2 చిత్రాల తర్వాత టాలీవుడ్ లో ఆమెకు క్రేజ్ బాగా పెరిగింది.

ఇక మీనాక్షి కూడా సంక్రాంతికి వరుస సినిమాలతో సందడి చేయడానికి సిద్ధపడుతుంది. మెగాస్టార్ విశ్వంభర తో పాటు వెంకీ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు ఇంచుమించు ఒకే సమయంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. విశ్వంభర ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ కన్ఫామ్ చేసుకుంది. ఇందులో మీనాక్షి నటించేది చిన్న పాత్ర అయినప్పటికీ మంచి కంటెంట్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. వెంకీ మామ చిత్రం కూడా సంక్రాంతికి అటు ఇటుగా విడుదల అయిపోతుంది. దీంతో ఈసారి సంక్రాంతి స్టార్ హీరోయిన్ గా మీనాక్షి బాగా పాపులర్ అవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

Tags:    

Similar News