రెమ్యునరేషన్ డోస్ పెంచిన మహేష్ బ్యూటీ

వివరాళ్లోకి వెళితే.. హరియాణాకు చెందిన మీనాక్షి చౌదరి.. 'అవుట్ ఆఫ్ లవ్' అనే సిరీస్​తో నటిగా మారింది.

Update: 2023-10-10 02:30 GMT
రెమ్యునరేషన్ డోస్ పెంచిన మహేష్ బ్యూటీ
  • whatsapp icon

మీనాక్షి చౌదరి అంటే కొంత కాలం క్రితం వరకు పెద్దగా ఎవరికీ తెలియదు కానీ... ఇప్పుడు గుంటూరు కారం హీరోయిన్​ అనగానే టక్కున గుర్తు పట్టే స్టేజ్​కు వెళ్లిపోయింది. మహేశ్​ బాబు పుణ్యమా అని టాలీవుడ్​లో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటోంది! తాజాగా ఈ భామ రెమ్యునరేషన్​ను గట్టిగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

వివరాళ్లోకి వెళితే.. హరియాణాకు చెందిన మీనాక్షి చౌదరి.. 'అవుట్ ఆఫ్ లవ్' అనే సిరీస్​తో నటిగా మారింది. ఆ తర్వాత సుశాంత్​ నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే సినిమాతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 'ఖిలాడీ', 'హిట్ 2' సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్​తోనూ కురాళ్ల దిల్​ను దోచేసింది. తమిళంలో విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన కోలై అనే సినిమాలోనూ నటించి ఆకట్టుకుంది.


అనంతరం మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాలో హీరోయిన్​గా సడెన్​ ఛాన్స్​ అందుకుని ఒక్కసారిగా మరింత క్రేజ్ సంపాదించుకుంది. అప్పటివరకు రాని ఫేమ్​ను ఈ ఒక్క ఛాన్స్​తో అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్​లో వరుస ఆఫర్లతో బిజీగా మారిపోతోంది.చిన్నా చితకా సినిమాల నుంచి సరాసరి పెద్ద స్టార్స్​తో సినిమాలు చేసే రేంజ్​కు ఎదిగిపోయింది.

ప్రస్తుతం ఒకేసారి ఐదు సినిమాల్లో యాక్ట్​ చేస్తోంది. 'గుంటూరు కారం'తో పాటు విశ్వక్​ సేన్​ 'వీఎస్​ 10', వరుణ్ తేజ్​తో 'మట్కా', సింగపూర్ సలూన్​, లక్కీ భాస్కర్​ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ.. రెమ్యునరేషన్​ కూడా బాగా పెంచేసిందట. కోటిన్నర వరకు డిమాండ్ చేస్తోందని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా.. గుంటూరు కారం ఆఫర్​ ఈమెకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఒక్కసారిగా ఈమె ఫేట్​ను మార్చేసింది. ఇక ఈమె పారితోషిక వివరాలు తెలుసుకుంటున్న సినీ ప్రియులు.. మహేశ్​బాబు హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉంటది మరి అని కామెంట్లు చేస్తున్నారు. సోషల్​ మీడియాలో ఈ విషయాన్ని తెగ షేర్ చేస్తున్నారు.

Tags:    

Similar News