హీరోలకు లాంగ్ కెరీర్ కారణం ఇదా?
చివరిగా 2016లో వన్స్ అగైన్ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. అయితే తాజాగా ఆమె కంబ్యాక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
బాలీవుడ్ సీనియర్ నటి మీనాక్షి శేషాద్రి పరిచయం అవసరంలేని పేరు. బాలీవుడ్ లోఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ ని షేక్ చేసిన బ్యూటీ. మీనాక్షి శేషాద్రి తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించారు. 'జీవన పోరాటం', 'ఆపద్బాందవుడు', ' బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాల్లో నటించారు. ఆ మూడు సినిమాలు మినహా తెలుగులో మరో సినిమాలో నటించలేదు. ఆమె కెరీర్ బాలీవుడ్ లో నే సాగింది.
చివరిగా 2016లో వన్స్ అగైన్ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. అయితే తాజాగా ఆమె కంబ్యాక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మంచి అవకాశాలు వస్తే నటిస్తానని తెలిపారు. మరి ఈ సీనియర్ నటికి అవకాశాలు వస్తాయా? లేదా? అన్నది చూడాలి. అలాగే ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆమె మాటల్లోనే..
'అప్పట్లో రాజ్ కుమార్ సంతోషీ తెరకెక్కించిన 'దామిని'లో హీరోయిన్ గా నటించా. షూటింగ్ సమయంలో రాజ్ కుమార్ పెళ్లిచేసుకుంటానని ప్రపోజ్ చేసారు. కానీ నాకు నచ్చక తిరస్కరించడంతో కొపగించు కున్నారు. దీంతో ఆ సినిమా నుంచి తొలగించి మరో హీరోయిన్ ని తీసుకోవాలనుకున్నారు.ఈ విషయం ఇండస్ట్రీ పెద్దలకు తెలిసి వ్యవహారం సద్దుమణిగేలా చేసారు. హీరోలకు లాంగ్ కెరీర్ ఉంటుంది. అందుకు చాలా కారణాలున్నాయి.
పురుషులు ఇంటి పనికి దూరంగా ఉంటారు. అందువల్ల వారు కెరీర్ పైనే దృష్టి పెడతారు. ప్రెగ్నెన్నీ, పిల్లలకు జన్మనివ్వడం, పిల్లలు పెంచడం వంటి విషయాల్లో చింతన ఉండదు. ఇవన్నీ స్త్రీ బాధ్యతలు. నటులకు ఎంత వయసు వచ్చినా వారిని తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. మహిళా నటుల విషయంలో అలా ఉండదు. వయసు మీద పడేసిరికి చూసే వారి సంఖ్య తగ్గిపోతుంది. అందుకే పురుషులకు లాంగ్ కెరీర్ ఉంటుంది' అని అన్నారు.