ముద్దు సీన్లపై మాట మార్చిన మీనాక్షి
పబ్లిగ్గా ముద్దు సీన్లు చేయాలంటే ఏ కథానాయికకు అయినా ఇబ్బందే. ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతారు మన కథానాయికలు.
పబ్లిగ్గా ముద్దు సీన్లు చేయాలంటే ఏ కథానాయికకు అయినా ఇబ్బందే. ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతారు మన కథానాయికలు. అయితే తనకు ముద్దు సన్నివేశాలకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, అంటూ బోలెడన్ని కండీషన్లు చెప్పింది మీనాక్షి శేషాద్రి. ఈ అమ్మడు నటించిన అన్ని సినిమాల్లోను ముద్దు సీన్లు చాలా కామన్. సీనియర్ హీరో రవితేజతో ఘాటైన ముద్దు సీన్లలో నటించింది ఖిలాడీలో. అలాగే యువహీరో అడివి శేష్ తోను చుంబనాల్లో ఆరి తేరింది. ఇప్పుడు మహేష్ తో గుంటూరు కారంలోను చెలరేగింది. కానీ తనకు ముద్దు సీన్లు చేయాలంటే కండీషన్స్ అప్లయ్ అని చెప్పడమే విడ్డూరంగా ఉందని అంటున్నారు అభిమానులు.
మీనాక్షి చౌదరి 2021లో విడుదలైన తెలుగు చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`తో తన సినీ రంగ ప్రవేశం చేసింది. మాస్ మహారాజా రవితేజతోయాక్షన్ డ్రామా ఖిలాడిలో నటించింది. ఈ చిత్రంలో డింపుల్ హయాతి కూడా మరో కథానాయిక. మహేష్ లాంటి స్టార్ హీరోతో గుంటూరు కారంలోను నటించింది.
ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా, మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. సన్నివేశం డిమాండ్ చేస్తేనే ముద్దు సీన్లకు ఓకే చెబుతానని, అసభ్యకరంగా అనిపించినా చేయలేనని చెబుతానని అంది. ఆ సన్నివేశంలో అవసరమైతేనే.. సందర్భం కలిసొస్తేనే పెదవి ముద్దుకు ఓకే అని చెబుతానని కూడా ఖరాకండిగా తెలిపింది.
కానీ ఖిలాడీ సమయంలో మీనాక్షి వెర్షన్ వేరేగా ఉంది. ఖిలాడీ లో పెదవి ముద్దుల్లో చెలరేగిన మీనాక్షి అప్పటి ఇంటర్వ్యూలో ముద్దు సీన్ల గురించి ముచ్చటించింది. దర్శకుడు రమేష్ వర్మ కథను వివరించినప్పుడు ముద్దులు, సన్నిహిత సన్నివేశాల గురించి నాకు తెలియజేశారు. ఈ విషయాలు కమర్షియల్ సినిమాల్లో భాగమని నేను అర్థం చేసుకున్నాను. తెరపై ముద్దు సన్నివేశాలను ప్రదర్శించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు... అని తెలిపింది. అప్పటి వెర్షన్ కి ఇప్పటి వెర్షన్ కి కొంత మార్పు కనిపిస్తోందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.