విజ‌య్ ఆంటోనీ కుమార్తె మృతి మీడియా క‌వరేజీ పై TNCRW పై యాక్ష‌న్!

ఫోర్త్ ఎస్టేట్ మీడియాకంటూ కొన్ని ప‌రిమితులున్నాయి. కానీ సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక సీన్ మొత్తం మారిపోయింది

Update: 2023-09-21 11:14 GMT

ఫోర్త్ ఎస్టేట్ మీడియాకంటూ కొన్ని ప‌రిమితులున్నాయి. కానీ సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక సీన్ మొత్తం మారిపోయింది. సామాజిక మాధ్య‌మాల‌కి పోటీగా నేటి మీడియా ప‌నిచేయాల్సి ఉంది. ఛాన‌ల్స్.. ప‌త్రిక‌లు..వెబ్ సైట్లు.. యూ ట్యూబ్ ఛానెళ్లు ఇత‌ర‌త్రా అన్ని మాధ్య‌మాలు సోష‌ల్ మీడియాతో ప‌రుగులు పెడుతున్న రోజులివి. ఈ పోటీ వాతావ‌ర‌ణంలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు..ఎవ‌రి విశ్లేష‌ణ‌లు వారివి.

ఎవ‌రి ప్ర‌త్యేక‌త వారిది. ఈపోటీని ఎదుర్కోవాలంటే అంద‌రికంటే ముందుండి దూసుకుపోవాలి. అప్పుడే మార్కెట్ లో నిల‌బ‌డేది. ఈ పోటీ క్ర‌మంలోనే కొన్ని ర‌కాల తప్పుడు క‌థ‌నాల కార‌ణంగా జ‌ర్న‌లిజం కూడా విలువ కోల్పోతుంద‌ని కొంత‌ కాలం గా ప్ర‌ధానం గా వినిపిస్తోన్న విమ‌ర్శ‌. నిబంధ‌న‌లు మీరి మీడియా తీరు క‌నిపిస్తుంద‌ని విమ‌ర్శ‌లు ప‌లు వేదిక‌ల‌పై తెర పైకి వ‌చ్చాయి. గ‌తంలో సుషాంత్ సిగ్ రాజ్ పుత్..శ్రీదేవి మ‌ర‌ణ వార్త‌ల‌పై వెలువ‌డిన క‌థ‌నాల నేప‌థ్యంలో బాలీవుడ్ మీడియాపై పెద్ద ఎత్తున నెగిటివిటీ స్ప్రెడ్ అయింది.

తాజాగా కోలీవుడ్ మీడియా మ‌రోసారి అలాంటి విమ‌ర్శ‌కు తావిచ్చింది. త‌మిళ న‌టుడు విజ‌య్ ఆంటోనీ కుమార్తె మీరా ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే అంత్యక్రియలు జరుగుతున్న స‌మ‌యంలోనూ చర్చి లోపల కొన్ని కెమెరాలు వెలిసాయి. అవి చిన్న పాటి ఛానెల్స్ అయితే తెలిసో తెలియ‌కో క‌వ‌రేజ్ చేసారు అనుకోవ‌చ్చు. కానీ కొన్ని ప్ర‌ముఖ‌ యూట్యూబ్ ఛానెల్స్ ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాయి . ఆ స‌మ‌యంలో అక్క‌డ జ‌రుగుతోన్న ప్ర‌తీ క‌ద‌లిక‌ను కెమెరాలో బంధించారు.

నిజంగా ఇది హేయ‌మైన చ‌ర్య‌. ఇలాంటి విష‌యాల్లో మీడియా క‌వ‌రేజ్ అనేది కొంత‌వ‌ర‌కూ ప‌రిమితం. కానీకోలీవుడ్ మీడియా హ‌ద్దు మీరిందన్న విమ‌ర్శ‌లు ఎదుర్కోంటుంది. దీన్ని ఉన్మాద చ‌ర్య‌గా నెటి జ‌నులు సోష‌ల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. అలాగే అంత‌కు ముందు కొన్ని ప్రముఖ తమిళ ఛానెల్‌లకు చెందిన రిపోర్టర్లు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని మాత్రమే కాకుండా వారి ఇంట్లో పని చేసే వంటవారిని- పనిమనిషిని ఘ‌న‌ట‌కు సంబంధించిన వివ‌రాలు అడిగిన విధానంపై నా భ‌గ్గుమంటున్నారు. ఆత్మహత్య వెనుక మీడియా ఊహాగానాలేంటి? అత్యుత్సాహం? ఏంటి అని మండిప‌డుతున్నారు. ఈ మీడియా కవరేజీని తమిళనాడు చైల్డ్ రైట్స్ వాచ్ (TNCRW) కూడా విమర్శించింది. ఇలాంటి నో ఎథిక్స్ టీవీ ఛానెల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు స‌మాచారం.

Tags:    

Similar News