'అల్లు వర్సెస్ మెగా' మరోసారి తెరపైకి..!
అయితే అల్లు వ్యతిరేక వర్గం దీనికి వ్యతిరేకంగా ట్రోల్ చేస్తుండడం ఆశ్చర్యకరం.
మోస్ట్ అవైటెడ్ 2024 మూవీ `పుష్ప 2` ట్రైలర్ విడుదలైంది. బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఈ వేడుకకు బిహారీ ఉప ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, మైత్రి అధినేతలు సహా పలువురు ఈ వేడుకలో వేదికపై మెరిసారు. ట్రైలర్ విడుదలై ఇప్పటికే కోటి పైగా వ్యూస్ తో దూసుకెళుతోంది. కేవలం ఉత్తరాది నుంచి 50లక్షల మంది వీక్షించడం ఆశ్చర్యకరం. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి కోటి పైగా వ్యూస్ పైగా వచ్చాయి.
పుష్ప 2 ట్రైలర్ తోనే భారీ పాన్ ఇండియా వైబ్స్ ని క్రియేట్ చేయగలిగిందన్న టాక్ ఓవైపు వినిపిస్తోంది. అయితే అల్లు వ్యతిరేక వర్గం దీనికి వ్యతిరేకంగా ట్రోల్ చేస్తుండడం ఆశ్చర్యకరం. అల్లు అర్జున్ అభిమానులు ఈ ట్రైలర్‌ని సెలబ్రేట్ చేసుకుంటుండగానే ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. మెగా ఫ్యాన్స్ లోనే చరణ్,పవన్ అభిమానగణం పుష్ప 2 ట్రైలర్ పై విమర్శలు గుప్పించడం సోషల్ మీడియా వేదికల్లో కనిపించింది. మరీ ముఖ్యంగా విదేశాలలోను మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ డివైడ్ కారణంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఇక ఇందులో రాజకీయ పార్టీల ప్రమేయం కూడా స్పష్ఠంగా కనిపిస్తోంది.
అయితే పరిశ్రమలో ఇలాంటి విభేధాలను సాధ్యమైనంత తక్కువలో ఉంచుతారన్నది తెలిసిందే. మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ ఎలా ఉన్నా కానీ, ఆ కుటుంబంలో హీరోలంతా సన్నిహితంగానే ఉన్నారు. అల్లు అర్జున్ పై చిరుకు కానీ, చరణ్ కి కానీ ఎలాంటి వ్యతిరేకతా లేదు. చిరు, చరణ్ లకు బన్నీ ఎప్పుడూ వ్యతిరేకి కాదు. ఇవన్నీ కేవలం ఆ క్షణం సోషల్ మీడియాల్లో కనిపించే ఫ్యాన్ వార్స్ గానే పరిగణించాలి. పరిణతి చెందిన అభిమానులతో పోలిస్తే అంతగా పరిణతి చెందని, రాజకీయాలతో అంటకాగిన ఒక సెక్షన్ ఫ్యాన్స్ మెగా కుటుంబంపై ఉన్నవీ లేనివీ నూరి పోస్తారన్న విమర్శలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాల్లో హ్యాష్ ట్యాగ్ కల్చర్ వల్ల కూడా ఈ పరిణామం ప్రమాదకరంగా మారింది.