మెగా బాక్సాఫీస్.. ఆ 3 నెలలు బ్లాస్టే
ఈ ఏడాదిలో కూడా మూడు నెలల వ్యవధిలో ముగ్గురు మెగా హీరోల సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి
మెగా హీరోల సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయంటే ఫ్యాన్స్ కి పూనకాలే. ముఖ్యంగా స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలకి మెగా ఫ్యాన్స్ పెద్దపీట వేస్తారు. ఈ సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో హంగామా సృష్టిస్తారు. మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ అతి పెద్ద బలం. అందుకే ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సినిమాలు రిలీజ్ చేసే ప్రయత్నం మెగా హీరోలు చేస్తూనే ఉన్నారు.
ఈ ఏడాదిలో కూడా మూడు నెలల వ్యవధిలో ముగ్గురు మెగా హీరోల సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ మూడు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషమని చెప్పాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న పుష్ప ది రూల్ మూవీ ఆగష్టు 15కి ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. ఈ మూవీపై దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ అయ్యి ఉంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో మూవీ థియేటర్స్ లోకి రానుంది.
ఈ సినిమా తర్వాత సెప్టెంబర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. క్లైమాక్స్ షూట్ కూడా శంకర్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే శంకర్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తోన్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి.
దీని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో మూవీ ఓజీ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ 50 శాతం ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ హడావిడి అయ్యాక మళ్ళీ షూటింగ్ లో మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాని అన్నిటికంటే ముందు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ముందుగా షూటింగ్ వేగంగా కంప్లీట్ అయితే జులైలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
ఒక వేళ షూటింగ్ ఆలస్యం అయితే మాత్రం అక్టోబర్ లో మాత్రం కచ్చితంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మోస్ట్ అవైటింగ్ మూవీగా ఈ సినిమా ఉంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా మూవీగా వస్తుండటంతో ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా ఈ సినిమా పవన్ ఇమేజ్ ని ఇండియా వైడ్ గా ఎస్టాబ్లిష్ చేస్తుందని భావిస్తున్నారు. ఇలా మెగా హీరోలు ముగ్గురు మూడు నెలల్లోనే తమ సినిమాలని రిలీజ్ చేస్తూ ఉండటంతో ఫ్యాన్స్ సందడికి ఇక హద్దే ఉండదు.