మెగాస్టార్ 156 లో రకుల్ ప్రీత్ సింగ్!
స్వయంగా చిరంజీవి పెద్దకు మార్తె సుస్మిత ఈ చిత్రాన్ని నిర్మించడంతో ఆమె అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు
మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్లు సెట్ అవ్వడం ఇబ్బందిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమన్నా..కాజల్ అగర్వాల్..నయనతార లాంటి భామలు నటించడంతో మళ్లీ వాళ్లని రిపీట్ చేయలేని పరిస్థితి. కొత్త హీరోయిన్ తీసుకుంటే చిరంజీవికి వయసుకు మ్యాచ్ అవ్వడం కష్టం అవుతుంది. ఫాంలో ఉన్న ఏ భామని తీసుకురావలన్నా వయసు అడ్డంకిగా మారుతుంది. మరికొంత మంది హీరోయిన్లు ఆ యవసున్న హీరోలకు చెల్లెళ్లుగానూ నటించడంతో! వెంటనే వాళ్లని ఎంపకి చేయలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో 156..157 చిత్రాల్లో హీరోయిన్లగా ఎవరు ఎంపిక అవుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. 157వ సినిమాకి సంబంధించి అనుష్క..నయనతారని పరిశీలిస్తున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే లోపు వాళ్లిద్దరిలో ఎవరో ఒకర్ని లాక్ చేసే అవకాశం ఉంది. మరి 156వ సినిమాలో హీరోయిన్ పరిస్థితి ఏంటి? అంటే తాజాగా ఈ విషయం వెలుగులోకి వస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అన్నది ఇంకా నిర్మాతలు ప్రకటించలేదు.
స్వయంగా చిరంజీవి పెద్దకు మార్తె సుస్మిత ఈ చిత్రాన్ని నిర్మించడంతో ఆమె అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ని రంగంలోకి దించే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నట్లు తెలిసింది. రకుల్ ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు చేసింది. వెల్ నోన్ పేస్. సీనియర్ భామలకు సరితూగే భామే. చరణ్ కి మంచి స్నేహితురాలు. గతంలో తని ఒరువన్ రీమేక్ లో నటించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతుంది.
ఇప్పుడా స్నేహంతోనే డాడ్ కి హీరోయిన్ గా రకుల్ ఒప్పిస్తున్నట్లు సమాచారం. చరణ్ మాటను ఆమె కాదనే అవకాశం లేదు. పైగా చిరంజీవితో ఛాన్్ అంటే ఏ హీరోయిన్ కాదంటుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత సింగ్ విశ్వనటుడు కమల్ హాసన్ సరసన 'ఇండియన్ -2' లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ఓ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నా! రకుల్ పాత్రకి ఎ క్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.
ఆరకంగా తొలిసారి సీనియర్ హీరోతో రకుల్ తెరను పంచుకుంటుంది. తాజాగా చిరంజీవి సరసన షురూ చేసిందంటే? తిరుగుండదు. అటుపై నాగార్జున..బాలయ్య..వెంకటేష్ లాంటి హీరోలకు అమ్మడు ప్రమోట్ అవుతుంది. ఇప్పటికే ఓ తరం హీరోలందర్నీ అమ్మడు కవర్ చేసింది. ఆ అనుభవాన్ని రంగరించి సీనియర్లతో సై అనేస్తే సరి.