'విశ్వంభ‌ర‌'లో చిరు పాత్రపై లీకులు

మెగాస్టార్ చిరంజీవి ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారం అందుకోవ‌డం ప‌రిశ్ర‌మ‌కు గ‌ర్వ‌కార‌ణం

Update: 2024-01-28 05:35 GMT

మెగాస్టార్ చిరంజీవి ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారం అందుకోవ‌డం ప‌రిశ్ర‌మ‌కు గ‌ర్వ‌కార‌ణం. భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో లెజెండ‌రీ న‌టుడిగా చిరుకు ద‌క్కిన గొప్ప గౌర‌వం గుర్తింపుగా దీనిని చూస్తున్నారు. మెగా కుటుంబం స‌హా తెలుగు ప్ర‌జ‌లంతా ఈ సంద‌ర్భాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నారు. కెరీర్ లో 150 పైగా చిత్రాల్లో న‌టించి ఇప్ప‌టికీ అజేయంగా వ‌ర‌స చిత్రాలు చేస్తూ చిరు త‌న‌కు ఎదురే లేద‌ని నిరూపిస్తున్నారు.

ఇక చిరంజీవి త‌దుప‌రి చిత్రం ఇటీవ‌ల విస్త్ర‌తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దొంగ‌మొగుడు, జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి, అంజి త‌ర్వాత మ‌ళ్లీ ఫాంట‌సీ జాన‌ర్ లో ఆయ‌న ఒక సినిమా చేస్తున్నార‌నేది అభిమానుల‌ను ఎగ్జ‌యిట్ చేస్తోంది. చిరు నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర ఫాంట‌సీ నేప‌థ్య సినిమా. ఇది ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. దీనికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. అతి త్వరలో చిరంజీవి సెట్స్‌పైకి వెళ్లనున్నారు.

ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి పాత్ర గురించి ఆస‌క్తిక‌ర లీక్ అందింది. ఈ పాత్ర‌కు 'దొరబాబు' అని పేరు పెట్టినట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ రాయల్ లుక్‌లో కనిపిస్తార‌ని ఇప్ప‌టికే టాక్ ఉంది. కొద్ది రోజుల క్రితం రివీల్ అయిన మెగా విజువ‌ల్ గ్లింప్స్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఫాంట‌సీ నేప‌థ్యంలో సినిమా కాబ‌ట్టి ఇది పాన్ ఇండియా కేట‌గిరీలో సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు. సైరా న‌ర‌సింహారెడ్డి తో హిందీ ప‌రిశ్ర‌మ‌లోను చిరంజీవి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. అందువ‌ల్ల అది విశ్వంభ‌ర‌కు నార్త్ బెల్ట్ లోను హైప్ పెంచే అంశం. ప్ర‌స్తుతానికి మెగాస్టార్ సెట్స్‌లో జాయిన్ అయ్యి చిత్రీకరణ ప్రారంభించాల్సి ఉంది. త‌దుప‌రి మ‌రిన్ని లీకులు అందుతాయ‌న‌డంలో సందేహం లేదు.


Tags:    

Similar News