వీడియో ప్రూఫ్: మైఖేల్ జాక్సన్ ఎప్పటికీ రారాజు
పాప్ సామ్రాజ్యపు చక్రవర్తి, అసాధారణ ప్రతిభావంతుడు మైఖేల్ జాక్సన్ సృజనాత్మకత ఎప్పటికీ ఎందరికో స్ఫూర్తిదాయకమైనది.
పాప్ సామ్రాజ్యపు చక్రవర్తి, అసాధారణ ప్రతిభావంతుడు మైఖేల్ జాక్సన్ సృజనాత్మకత ఎప్పటికీ ఎందరికో స్ఫూర్తిదాయకమైనది. ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఇమ్మిటేట్ చేసే కొరియోగ్రాఫర్లు ఉన్నారు. ఇప్పటికీ జాక్సన్ కొరియోగ్రఫీ నుంచి ఛమక్కులాంటి స్టెప్పులను కాపీ చేసి దానిని ఆయనకు అంకితమివ్వడం చూస్తున్నదే. ఇందుకు పాపులర్ బీటీఎస్ కూడా అతీతం కాదని తాజాగా ప్రూవ్ అయింది.
BTS కొరియన్ బాయ్ బ్యాండ్ పరిచయం అవసరం లేదు. సంవత్సరాలుగా ప్రపంచాన్ని తమ ప్రతిభతో ఓలలాడిస్తున్న కొందరు సభ్యులతో కూడుకున్న బ్యాండ్ ఇది. వీరు కూడా ఇప్పుడు మైఖేల్ జాక్సన్ పాటల నుంచి స్ఫూర్తి పొందారు. మైఖేల్ జాక్సన్ డాక్యుమెంటరీ `థ్రిల్లర్ 40`లో ప్రత్యేక ప్రస్తావన వచ్చినందున BTS మరోసారి హెడ్ లైన్స్ లోకి వచ్చింది. మైఖేల్ జాకన్ 40వ వార్షికోత్సవం సందర్భంగా దిగ్గజ పాప్ స్టార్ డాక్యుమెంటరీ విడుదలైంది. కొత్త కళాకారులపై అతని సంగీతం ప్రభావాన్ని ఈ డాక్యుమెంటరీలో ప్రస్థావించారు. బీటీఎస్ ప్రతిభావంతులు సహా ఎందరో జాక్సన్ నుంచి స్ఫూర్తి పొందినవారే.
థ్రిల్లర్ 40లో BTS ప్రత్యేక ప్రస్తావన క్లిప్ వైరల్ అయింది. దీంతో అభిమానులు ఈ మైలురాయిని సెలబ్రేట్ చేసుకోకుండా ఆగలేదు. వైరల్ క్లిప్‌లో మైఖేల్ జాక్సన్ కొరియోగ్రఫీతో BTS స్టెప్పులను పోల్చారు. డాక్యుమెంటరీ విభాగంలో బీటీఎస్ ప్రతి కదలికలో మైఖేల్ జాక్సన్ ఉన్నరు! అని పేర్కొన్నారు. థ్రిల్లర్ 40లో BTS ప్రత్యేక ప్రస్తావన రావడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. వీడియో వైరల్ అయిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాల్లో ప్రతిస్పందించారు. BTSని ప్రశంసించారు. ఒక అభిమాని ఇలా రాసాడు. ``వారి గురించి చాలా గర్వంగా ఉంది!! ఇది అద్భుతమైనది`` అని రాయగా, ఇంకొక అభిమాని ఇలా రాసాడు. నేను వారిపై BTS మరియు MJ ప్రభావం గురించి చాలా నేర్చుకున్నాను అని రాసాడు.
BTS గురించి వివరాలు:
2010లో ఏర్పాటైన BTS ఏడుగురు కళాకారుల సమూహం. V, జంగ్‌కూక్, సుగా, RM, జిన్, J-హోప్, జిమిన్ బృందాన్ని బీటీఎస్ అని పిలుస్తారు. ఈ బ్యాండ్ ప్రస్తుతం విరామంలో ఉంది. తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి పెడుతోంది. మొత్తం ఏడుగురు అబ్బాయిలు ఈ సంవత్సరం సోలో అరంగేట్రం చేశారు. 2022లో BIGHIT MUSIC సైనిక సేవలో చేరడానికి BTS టీమ్ నుంచి RM, V, జిమిన్, జంగ్‌కూక్‌లను చేర్చుకున్నట్లు ప్రకటించింది. దీనిపై ఏజెన్సీ ఒక ప్రకటనను విడుదల చేసింది. ``కళాకారులు వారి సైనిక సేవా విధులను నెరవేర్చడానికి సిద్ధమవుతున్నారు. మేము తదుపరి విషయాలను గడువులోగా మీకు తెలియజేస్తాము. RM, జిమిన్ పట్ల మీ నిరంతర ప్రేమ, మద్దతు కోసం మేము మిమ్మల్ని అడుగుతున్నాము. వి - జంగ్‌కూక్ తమ సైనిక సేవను పూర్తి చేసి సురక్షితంగా తిరిగి వచ్చే వరకు ...! అని రాసారు.