వెండితెర మీద మిర్జాపూర్..!

అందరు మిర్జాపూర్ సీజన్ 4 కోసం ఎదురుచూస్తుంటే ఆ సీరీస్ మేకర్స్ మాత్రం మిర్జాపూర్ ది ఫిల్మ్ అంటూ కొత్త సర్ ప్రైజ్ ఇచ్చారు.

Update: 2024-10-28 10:07 GMT

అమేజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ వెబ్ సీరీస్ లిస్ట్ తీస్తే అందులో మిర్జాపూర్ ఉంటుంది. పంకజ్ త్రిపాఠి నటించిన ఈ వెబ్ సీరీస్ లో అలీ ఫాజల్, దివ్యేందు శర్మ నటించారు. 2018 లో మీర్జాపూర్ మొదటి సీజన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ వెబ్ సీరీస్ ను గుర్మీత్ సింగ్, కరణ్ అన్షుమన్, మిహిర్ దేశాయ్ డైరెక్ట్ చేశారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన మిర్జాపూర్ సీరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ సీరీస్ ను కొనసాగిస్తూ వచ్చారు.

ఈ ఇయర్ కూడా జూలైలో మీర్జాపూర్ సీజన్ 3 కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఐతే మిర్జాపూర్ సీరీస్ ఇంకా కొనసాగిస్తారని అనుకున్న ఆ సీరీస్ ఫ్యాన్స్ కి ఈసారి మేకర్స్ చాలా పెద్ద ప్లానే వేసినట్టు అనిపిస్తుంది. మిర్జాపూర్ కథను ఈసారి మూవీగా తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

అందరు మిర్జాపూర్ సీజన్ 4 కోసం ఎదురుచూస్తుంటే ఆ సీరీస్ మేకర్స్ మాత్రం మిర్జాపూర్ ది ఫిల్మ్ అంటూ కొత్త సర్ ప్రైజ్ ఇచ్చారు. మిర్జాపూర్ సీరీస్ ను ఎంతగానో ఆదరించారు. ఐతే ఈసారి మరింత పెద్దగా పెద్ద స్క్రీన్ మీద ఈ కథను చెప్పాలని అనుకుంటున్నాం అని మిర్జాపూర్ లోని నటీనటులు వెల్లడించారు. మిర్జాపూర్ ది ఫిల్మ్ అనౌన్స్ మెంట్ కి సంబంధించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

2026 లో బిగ్ స్క్రీన్ మీద మిర్జాపూర్ సినిమా తీసుకొస్తున్నారు. వెబ్ సీరీస్ గా సూపర్ సక్సెస్ అయిన మిర్జాపూర్ మూవీగా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ సీరీస్ ని బాగా ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ అంతా కూడా తప్పకుండా సినిమాను కూడా అదే రేంజ్ లో ఆదరిస్తారని చెప్పొచ్చు. మిర్జాపూర్ సినిమా ఎలా ఉంటుంది.. అసలు సీరీస్ కు సినిమాకు తేడా ఏంటి.. మేకర్స్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్నది సినిమా చూస్తేనే అర్థమవుతుంది.

బాలీవుడ్ ఆడియన్స్ అదే నార్త్ ఆడియన్స్ మిర్జాపూర్ సీరీస్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇప్పటివరకు 3 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సీరీస్ ఈసారి వెబ్ సీరీస్ గా కాకుండా భారీ సినిమాగా రాబోతుందని తెలుస్తుంది. సీరీస్ గానే ఎంతగానో అలరించిన మిర్జాపూర్ వెండితెర మీద అద్భుతాలు చేస్తుందని చెప్పొచ్చు.

థ్రిల్లర్, యాక్షన్ మూవీస్ ఇష్టపడే వెండితెర ప్రేక్షకులకు మీర్జాపూర్ సినిమా కచ్చితంగా మంచి ఎంటర్టైన్ అదిస్తుందని నమ్ముతున్నారు. 2026 అంటే రెండేళ్లలో బిగ్ స్క్రీన్ పై మెరిసేందుకు పర్ఫెక్ట్ ప్లాన్ తో వస్తారని చెప్పొచ్చు.

Tags:    

Similar News