ప్రభాస్ కొత్త సినిమాలో ఒకప్పటి బాలీవుడ్ బ్రేక్ డాన్సర్
బాలీవుడ్ లో 90s లో తన బ్రేక్ డాన్స్ లతో విశేషంగా యూత్ ని ఎట్రాక్ట్ చేసి కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మిథున్ చక్రవర్తి.
బాలీవుడ్ లో 90s లో తన బ్రేక్ డాన్స్ లతో విశేషంగా యూత్ ని ఎట్రాక్ట్ చేసి కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మిథున్ చక్రవర్తి. హీరోగా ఆయన సుదీర్ఘకాలం తన ప్రస్థానం కొనసాగించారు. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లో బిజీ యాక్టర్ అయిపోయారు. రెగ్యులర్ గా అతని నుంచి మూవీస్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ నటుడు ఇప్పటికే సౌత్ లోకి కూడా అడుగుపెట్టారు. 2015లో విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల మూవీలో మిథున్ చక్రవర్తి హిందూ స్వామీజీ పాత్రలో నటించాడు.
హిందీలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ కాంబోలో వచ్చిన OMG రీమేక్ గా గోపాల గోపాల తెరకెక్కింది. ఒరిజినల్ లో మిథున్ చక్రవర్తి చేసిన పాత్రనే తెలుగు రీమేక్ లో కూడా చేశారు. ఆ తరువాత మరల తెలుగు చిత్రాలలో ఆయన ఎప్పుడు కనిపించలేదు. 9 ఏళ్ళ తర్వాత మరోసారి పాన్ ఇండియా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులని మిథున్ చక్రవర్తి పలకరించబోతున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా తాజాగా లాంచ్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం హను రాఘవపూడి మిథున్ చక్రవర్తిని ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ తరువుత 1947లో జరిగిన కథగా ఉంటుందంట. సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ లో గురించి కూడా ఈ మూవీలో ఉంటుందంట.
అయితే ప్రభాస్ మాత్రం ఈ చిత్రంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా కనిపిస్తాడంట. మూవీ కథాంశం యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందా లేదంటే సీతారామం తరహాలో లవ్ స్టోరీని హను రాఘవపూడి చెబుతాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి ఫౌజీ అనే పేరుని పెట్టాలని అనుకుంటున్నారంట. త్వరలో దీనిపై ఒక స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.
సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుందంట. ఇప్పటికే 1947 వాతావరణం ఎలివేట్ అయ్యే విధంగా ఒక సెట్ ని కూడా నిర్మించారంట. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మూడు సాంగ్స్ ని ఇప్పటికే విశాల్ రెడీ చేసారంట. సీనియర్ నటి జయప్రద కీలక పాత్రలో ఈ చిత్రంలో కనిపించనుంది. 2026లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు తెలుస్తోంది.