"మనోజ్... నువ్వు నీ భార్య మాట వినీ..."... మోహన్ బాబు సంచలన ఆడియో!
మంచు ఫ్యామిలీలో మంటల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
మంచు ఫ్యామిలీలో మంటల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై సినీనటుడు మోహన్ బాబు స్పందించారు. మంగళవారం రాత్రి తన నివాసం వద్ద జరిగిన అలజడి అనంతరం ఆయన ఆడియో సందేశం విడుదల చేశారు.
అవును... తన కుటుంబంలో జరిగిన, జరుగుతున్న వ్యవహారాలపై మోహన్ బాబు ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా.. ఈ ఆడియోలో మనోజ్ తో మాట్లాడుతున్నట్లు స్పందించారు! ఈ సందర్భంగా మనోజ్ భార్య ప్రస్థావనా తెరపైకి తెచ్చారు. ఈ సందర్భంగా పలు సంచలన విషయాలను ఆ ఆడియో సందేశంలో మోహన్ బాబు వెల్లడించారు.
ఇందులో భాగంగా... "మనోజ్ నువ్వు నా బిడ్డవి.. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్ మిమ్మల్ని ఎలా పెంచాను? అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను. నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాలని ప్రయత్నించాను.. నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చాను.. నువ్వు ఈ రోజు నా గుండెల మీద తన్నావ్.. నా మనసు ఆవేదనతో కుంగిపోతోంది!"
"నువ్వు నన్ను నన్ను కోట్టడం ఏమిటి? నా బిడ్డ నన్ను తాకలేదు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం.. ప్రతీ కుటుంబంలోనూ ఇవి ఉంటాయి. రామాయణ, భాగవత, మహాభారతం చూశావు కదా. ఏమిటిది..? నీకు అన్నీ ఇచ్చినా ఈ రోజు నువ్వు నా గుండెల మీద తన్నడమే కాకుండా.. అపకీర్తిని తీసుకొచ్చావు!"
"ఎంత మంచి నటుడిని నువ్వు.. నీ భార్య మాట విని తాగుడుకు అలవాటు పడిపోయావ్... ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అనే పరిస్థితి తీసుకొచ్చావ్.. మన విద్యాలయాలు ఎంతో గొప్పవి.. కులమతాలకు అతీతంగా 25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం.. కేస్ట్ అనే కాలం తీసేశాం.. మన విద్యాలయాలపై ఏ తల్లితండ్రులైనా ఫిర్యాదు చేశారా"?
"జల్ పల్లి ఇల్లు నా కష్టార్జితం.. నీకు సంబంధం లేదు.. నువ్వు మద్యానికి బానిసగా మారి, మద్యం మత్తులో ఎలాగో ప్రవరిస్తున్నవ్.. ఇంట్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నవారిపై దాడికి దిగడం సరికాదు.. ఆస్తులు ముగ్గురుకీ సమానంగా రాయాలా వద్దా అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా.. లేక, దాన ధర్మాలు చేస్తానా అంది నా ఇష్టం!"
"మనోజ్ నీకు ఇంట్లోకి వచ్చే అధికారం లేదు. మీ వల్ల మీ అమ్మ అసుపత్రిలో చేరింది. భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావు.. తప్పు చేయనని చెప్పి మళ్లీ ఇంట్లోకి వచ్చావు.. నువ్వు తప్పు చేయవని మీ అమ్మ చెప్పింది.. ఇక చాలు, ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం!" అని మోహన్ బాబు పేర్కొన్నారు!