మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల... తెరపైకి కీలక విషయాలు!

ఈ క్రమంలో.. తాజాగా వైద్యులు ఆయన హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు.

Update: 2024-12-11 08:28 GMT

మోహన్ బాబు కుటుంబంలోని సమస్యలు గత మూడు రోజులుగా రచ్చకెక్కిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. దీంతో... మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో.. తాజాగా వైద్యులు ఆయన హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు.

అవును... మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... మోహన్ బాబు హాస్పటల్ కి వచ్చినప్పుడు ఒళ్లు నొప్పులు ఉన్నాయని వైద్యులు తెలిపారు.

ఇదే సమయంలో.. బీపీ బాగా పెరిగిందని.. అతనికి మెడలో నొప్పి విపరీతంగా ఉందని.. మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నారని.. ఎక్కువ యాంగ్జైటీగా ఉన్నారని.. ఈ రోజు ఇంకా బీపీ ఎక్కువగా ఉందని తెలిపారు. ఇదే సమయంలో.. మోహన్ బాబు ఫేస్ మీద కొన్ని గాయాలున్నాయని, బ్లీడింగ్ వంటివి ఏమీ లేవని వైద్యులు చెప్పారు.

మరోపక్క.. ఆయన హార్ట్ సైడ్ అంతా బాగానే ఉందని.. రాత్రంగా బాధ వల్ల సరిగా నిద్రపోలేదని.. గతంలో జరిగిన కొన్ని సర్జరీలతో ఆయన వేరే మెడిసిన్స్ వాడుతున్నారని కాంటినెంటల్ హాస్పిటల్ ఛైర్మన్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అన్ స్టేబుల్ గానే ఉందని.. ఇంటర్నల్ గాయాలూ ఉన్నాయని తెలిపారు.

ఈ సమయంలో ఆయన మానసికంగా కోలుకోవడానికి సమయం పడుతుందని.. డిశ్చార్జ్ కి ఇంకా రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

మరోపక్క ఈ రోజు రాచకొండ సీపీ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా... హైకోర్టులో మోహన్ బాబు తరుపున లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News