గుడివాడ రాయుడే కాదు ఈడీ అధికారి..ఆర్మీ ఆఫీసర్!
గుడివాడ రౌడీగా, బొబ్బర్లంక రామబ్రహ్మంగా, పశుపతి పాత్రల్లో నటుడు మోహన్ రాజా ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు.
గుడివాడ రౌడీగా, బొబ్బర్లంక రామబ్రహ్మంగా, పశుపతి పాత్రల్లో నటుడు మోహన్ రాజా ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. ` లారీ డ్రైవర్ , రౌడీ ఇనస్పెక్టర్, చినరాయుడు చిత్రాల్లో మోహన్ రాజా పోషించిన పాత్రలవి. నటుడిగా అతడిని తెలుగు ప్రేక్షకులు చిరకాలం గుర్తించుకునే గొప్ప పాత్రలవి. అప్పట్లో ఆ సినిమా లు చూసిన వారంతా అతడిని తెలుగు వారు అనుకునే వారు.
నిజంగా గుడివాడ నుంచి వెళ్లి విలన్ అయ్యాడా? అని అప్పట్లో ప్రేక్షకులు అనుకునేవారు. కానీ అతడు ఓ మలయాళి. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నారు. దాదాపు 300 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసారు. అతడు నటనను మించి ఎంతో తెలివైన విద్యార్ది అన్న సంగతి తెలుస్తోంది. అతడు సినిమాల్లోకి రాక ముందే అతడు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేసారు.
ఆర్మీ, కస్టమ్స్, ఎన్ ఫోర్స్ మెంట్ మోహన్ రాజా ఉన్నత ఉద్యోగాలు చేసారు. 20 ఏళ్ల వయసులోనే దేశానికి సేవ చేయాలని ఆర్మీలో సెలక్ట్ అయి అటువైపు వెళ్లారు. కొంత సర్వీస్ అనంతరం కానీ కాలికి బలమైన గాయం కావడంతో ఆ ఉద్యోగం వదిలేసారు. ఆ తర్వాత మరో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేసారు. చివరిగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ లో కూడా అధికారిగా పనిచేసారు.
కానీ సినిమాలపై ఉన్న ప్రేమతో ఆ ఉద్యోగాలన్నింటిని వదిలేసి చివరిగా సినిమాల్లోకి వచ్చి స్థిరపడ్డారు. ఇలా ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు చేసి...నటుడిగా ఉన్నత స్థానానికి చేరిన ఏకైక నటుడు మోహన్ రాజాగా చెప్పొచ్చు. ప్రత్యేకంగా ఆర్మీలో పనిచేసి వచ్చి సినిమాలు చేయడం అన్నది ఆయనకే చెల్లింది. భారతీయ చిత్ర పరిశ్రమలో అలాంటి నటుడు ఇంతవరకూ లేరు.