మోహన్ లాల్ L2E ఎంపురాన్ టీజర్ టాక్..!

ఓ పక్క నటుడిగా అదరగొడుతూ వరుస సక్సెస్ లను అందుకుంటున్న పృధ్వి రాజ్ సుకుమారన్ డైరెక్టర్ గా కూడా తన మార్క్ చూపిస్తూ వస్తున్నాడు.

Update: 2025-01-26 16:23 GMT

ఓ పక్క నటుడిగా అదరగొడుతూ వరుస సక్సెస్ లను అందుకుంటున్న పృధ్వి రాజ్ సుకుమారన్ డైరెక్టర్ గా కూడా తన మార్క్ చూపిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా మలయాళ స్టార్ మోహన్ లాల్ తో పృధ్విరాజ్ చేస్తున్న సినిమాలు సంథింగ్ స్పెషల్ గా నిలుస్తున్నాయి. ఈ కాంబోలో వచ్చిన లూసిఫర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా ఇప్పుడు ఆ సినిమాకు ఫ్రాంచైజీగా L2E ఎంపురాన్ సినిమా వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది.

మలయాళంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లూసిఫర్. ఆ సినిమా అంత బాగా ఉండటం వలే తెలుగులో చిరంజీవి రీమేక్ చేశారు. ఐతే తెలుగులో ఫలితం నిరాశ పరిచింది. లూసిఫర్ సినిమా ఫ్రాంచైజీగా పృధ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో మోహన్ లాల్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా ఎంపురాన్. ఈ సినిమాకు సంబందించిన టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

టీజర్ విషయానికి వస్తే లూసిఫర్ ఫ్రాంచైజీ అంటే దాని ధీటుగా కాదు దానికి మించి ఉండాలనుకున్న ఆడియన్ కు పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండేలా ఉంది. టీజర్ లో విజువల్స్, ఎలివేషన్స్ అన్ని మరో బ్లాక్ బస్టర్ పక్కా అనిపించేలా ఉన్నాయి. టీజర్ తోనే సినిమాపై ఒక సూపర్ హిట్ అప్పీల్ వచ్చేలా చేశాడు పృధ్విరాజ్ సుకుమారన్. L2E ఎంపురాన్ సినిమాకు కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ని మురళి గోపీ అందిస్తున్నారు.

ఈ సినిమాకు సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా దీపక్ దేవ్ మ్యూజిక్ అందిస్తునారు. సినిమాలో పృధ్విరాజ్ కూడా నటించారని తెలుస్తుంది. లూసిఫర్ ఫ్యాన్స్ కి ఈ L2E ఎంపురాన్ సినిమా తప్పకుండా మంచి ఫీస్ట్ అందించేలా ఉంది. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసి టీజర్ తో సర్ ప్రైజ్ చేసిన మేకర్స్ సినిమా రిలీజ్ ని కూడా లాక్ చేశారు. మార్చి 27న ఈ సినిమా రిలీజ్ లాక్ చేశారు.

Full View
Tags:    

Similar News