కంప్లీట్ స్టార్ @360..ఇదో చరిత్ర!
నాలుగు దశాబ్ధాల సినీ ప్రయాణంలో ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించారు.
మలయాళం స్టార్ మోహన్ లాల్ సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే ఏడాదిలో అత్యధిక సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించడం ఆయన ప్రత్యేతక. ఏడాదిలో కనీసం ఆరు సినిమాలైనా రిలీజ్ చేయాలన్న సంకల్పంతో పనిచేస్తారు. ఆరు కుదరని పక్షంలో నాలుగు సినిమాలైనా తప్పకుండా రిలీజ్ అయ్యేలా చూసుకుంటారు. మూడు షిప్టులు పనిచేసే నటుడాయన. రేయింబవళ్లు షూటింగ్ అంటూ క్షణం తీరిక లేకుండా ఉంటారు. అలాంటి స్టార్ హీరోని చూసి చిరంజీవి సైతం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంటారు.
నాలుగు దశాబ్ధాల సినీ ప్రయాణంలో ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించారు. `మంజిల్ విరింజ్ పొక్కల్` సినిమాతో తొలిసారి మ్యాకప్ వేసుకున్నారు. 1980లో ఈ సినిమా రిలీజ్ అయింది. అదే ఏడాది మరో మూడు సినిమాలు కూడా రిలీజ్ చేసారు. నటుడిగా ప్రయాణం మొదలు పెట్టిన తొలి ఏడాది లోనే నాలుగు సినిమాలతో అందరి దృష్టి ఆకర్షించారు. ఆ తర్వాత కంప్లీట్ స్టార్ జర్నీ వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోయింది. హీరోగానే కాకుండా గెస్ట్ అపిరియన్స్ ఇచ్చిన సినిమాలెన్నో.
1993 లో రిలీజ్ అయిన `గంధర్వం` అనేది ఆయన 200వ సినిమా. అప్పుడప్పుడు తమిళ...హిందీ..కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసారు. 2011 లో ఆయన 300వ చిత్రం స్నేహవీడు రిలీజ్ అయింది. `మహాత్మ` అనే తెలుగు సినిమా చేసారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన `జనతా గ్యారేజ్` లో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆయన రేంజ్ రెట్టింపు అయింది. అప్పటి నుంచి తెలుగు అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `కన్నప్ప`లో నూ నటిస్తున్నారు. 60 ఏళ్లు దాటినా అదే దూకుడుతో సినిమాలు చేయడం ఆయనకే చెల్లింది. మోహన్ లాల్ కొత్త ప్రాజెక్ట్ L 360 కూడా ప్రారంభ మైంది. `ఆపరేషన్ జావా` ఫేం తరుణ్ తరుణ్ మూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.