మోక్షజ్ఞ మూవీ.. ముందుగానే ఓ టార్గెట్ ఫిక్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-04 05:23 GMT

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కన్ఫర్మ్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ మూడు నెలల్లో మొదలవుతుందని బాలకృష్ణ రీసెంట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే సూపర్ హీరో స్టోరీతో ఈ సినిమా సిద్ధం కాబోతుందట.

అభిమన్యుడి క్యారెక్టర్ స్ఫూర్తితో ప్రశాంత్ వర్మ ఈ మూవీ కథని సిద్ధం చేసారంట. ఇదిలా ఉంటే ఈ నెల 6న మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అఫీషియల్ గా లాంచ్ కాబోతోందని సమాచారం. రామకృష్ణ స్టూడియోస్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరగబోతోందంట. ఇప్పటికే దానికి సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు సమాచారం.

ప్రశాంత్ వర్మ ఈ సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో వీలైనంత వేగంగా కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యాడంట. మూవీ రిలీజ్ డేట్ పై కూడా ఎనౌన్స్ రోజే క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందంట. 2025 దసరాకి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. ఎలాగూ ఏడాది సమయం ఉంది. ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని మరో ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ కి సమయం సరిపోతుంది.

అందుకే ఏడాదిలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేలా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకున్నాడంట. ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ఉంది. మోక్షజ్ఞ అరంగేట్రం సినిమాపై ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమ కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం విశేషం. ఈ సినిమా తర్వాత మోక్షజ్ఞతో సినిమాలు చేయడానికి మరో ముగ్గురు, నలుగురు దర్శకులు లైన్ అప్ లో ఉన్నారని బాలయ్య చెప్పారు.

నందమూరి హీరోలలో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు. మోక్షజ్ఞ ఎన్టీఆర్ ఇమేజ్ ని అందుకోగలడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా మోక్షజ్ఞ మాస్ హీరోగా ఒక సినిమా చేయాలని బాలయ్య అనుకుంటున్నారు. అఖండ సీక్వెల్ తర్వాత బోయపాటి మోక్షజ్ఞ సినిమాపై వర్క్ చేయొచ్చని మాట నందమూరి అభిమానుల్లో వినిపిస్తోంది.

Tags:    

Similar News