వ‌ర‌ల్డ్ ని షేక్ చేస్తున్నాడు? మ‌రి ఇండియా సంగ‌తేంటి!

తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వ‌చ్చింది. అయితే ఇది కేవ‌లం యుఎస్, యుకె తదితర దేశాల ఆడియన్స్ కి మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

Update: 2024-04-24 05:58 GMT

తెలుగు ట్యాలెంట్ దేవ్ ప‌టేల్ తెర‌కెక్కించిన హాలీవుడ్ మూవీ 'మంకీ మ్యాన్' గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో దిగ్విజ‌యంగా దూసుకుపోతుంది. కంటెంట్ కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నారు. ఓ తెలుగు ద‌ర్శ‌కుడు ఇంత గొప్ప సినిమా తీసాడా? అని అంతా చ‌ర్చించుకుంటోన్న స‌మ‌య‌మిది. ప్ర‌స్తుతం విదేశాల్లో 'మంకీ మ్యాన్' స‌త్తా చాటుతుంది. ఇండియాలో మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. సెన్సార్ అడ్డంకులు ఉండ‌టంతో మ‌నోభావాలు దెబ్బ తీస్తాయ‌ని క‌త్తిరింపులు వేసి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వ‌చ్చింది. అయితే ఇది కేవ‌లం యుఎస్, యుకె తదితర దేశాల ఆడియన్స్ కి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అంద‌రూ చూడ‌టానికి వీలు లేదు. ప్రైమ్..యాపిల్ లాంటి మాధ్య‌మాల ద్వారా రెంట్ పే చేసి చూసే ఆప్ష‌న్ ఉంది.

అది కొంద‌రికే. మ‌నికి ఇంకా ఆ ఛాన్స్ ఇవ్వ‌లేదు. సెన్సార్ చిక్కులున్నాయి కాబ‌ట్టి! అసౌకర్యానికి గురికాక త‌ప్ప‌దు. అయినా భార‌తీయులు త‌క్కువోళ్లేం కాదుగా...ఇంట‌ర్నెట్ లో సెర్చ్ చేసి ఏదోలా చూసే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది. రిలీజ్ కాకుండానే ఇండియాలో సినిమా పైర‌సీ అయిపోతుంది.

అందులోనూ రిలీజ్ అయిన సినిమా పైర‌సీ కాదు? అనుకోవ‌డం అన్న‌ది క‌ల మాత్ర‌మే. 'మంకీ మ్యాన్' పైర‌సీకి ఎక్కువ అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి నిర్మాత‌లు ఈ చిత్రాన్ని ఎంత వీలైంత అంత త్వ‌ర‌గా ఇండియాలో రిలీజ్ చేయాలి. లేక‌పోతే రిలీజ్ అనే ఆలోచ‌నే విర‌మించుకోవాలి. లేదంటే ఈ లోపు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోతుంది. మ‌రి ఇన్ని అడ్డంకుల్ని తొల‌గించికుని మంకీ మ్యాన్ అధికారికంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొస్తుందా? రాదా? అన్న‌ది చూడాలి.

ఈ సినిమాకి తెలుగు ద‌ర్శ‌కుడు ప‌నిచేయ‌డంతో దేవ్ ప‌టేల్ కి మంచి పేరొస్తుంది. స్ల‌మ్ డాగ్ మిలీయ‌నీర్ తో దేవ్ ప‌టేల్ బాల న‌టుడిగా తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాతో వ‌ర‌ల్డ్ అంతా ఫేమ‌స్ అయ్యాడు. ఆస్కార్ అవార్డులు వ‌రించ‌డంతోనే అది సాధ్య‌మైంది. తాజాగా మంకీ మ్యాన్ తో మ‌రోసారి ప్ర‌పంచ వ్యాప్తంగా నీరాజ‌నాలు అందుకుంటున్నాడు.

Tags:    

Similar News