టికెట్ రేట్లు పెంచ‌కుండా కొట్లు కొల్ల‌గొట్ట‌లేరా?

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల వ‌సూళ్లు వ‌ర‌దలా పారుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2025-01-25 08:30 GMT

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల వ‌సూళ్లు వ‌ర‌దలా పారుతోన్న సంగ‌తి తెలిసిందే. తొలి రోజే 100..150..200 కోట్లు అంటూ వ‌సూళ్ల పోస్ట‌ర్లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. వారం ముగిసే స‌రికి ఆ లెక్క 500 కోట్ల క్ల‌బ్ లో కి చేరి పోతుంది. ఈ లెక్క‌ల‌న్నీ నిర్మాత‌లు అధికారికంగా పోస్ట‌ర్లు వేసి మ‌రీ చెబుతున్నారు. ఇది ఎలా సాధ్య‌మంటే? టికెట్ రేట్లు అధికంగా పెంచడంతోనే సాధ్య‌మ‌న్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం. వారం ప‌ది రోజుల పాటు ప్రేక్ష‌కుడిని నెత్తి మీద బాది వంద‌ల కోట్లు లాగుతున్నార‌న్న‌ది ప‌చ్చి వాస్త‌వం.

సినిమా 500 కోట్లు పెట్టాం..600 కోట్లు పెట్టాం ఆ డ‌బ్బు రిక‌వ‌రీ చేయాలంటే? ఇలా బాద‌డం త‌ప్ప‌ని స‌రే అన్న‌ది ఓపెన్ సీక్రెట్. ఇక్క‌డ తెలివిగా అభిమానాన్ని ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే వంద‌ల కోట్లు వ‌సూళ్లు సాధ్య‌మ వుతున్నాయి. ఇలా టికెట్ రేట్లు పెంచ‌డం అన్న‌ది సామాన్యుడికి భార‌మ‌వుతుంద‌ని విశ్లేష‌ణ తెర‌పైకి వ‌స్తే ఓ నిర్మాత 1500 రూప‌యాలు ఆప్ట్రాల్ అన్న‌ట్లు చెప్పారు .

మ‌రి టికెట్ రేట్లు పెంచ‌కుండా 200..300..500 కోట్ల వ‌సూళ్లు సాధ్య‌మ‌వ్వ‌వా? అంటే ఎందుకు సాధ్యం కాద‌న్న‌ది సామాన్యుడి ప్ర‌శ్న‌. ఈ ప్ర‌శ్న‌ని ట్రేడ్ వ‌ర్గం సైతం స‌మ‌ర్ధించింది. కంటెట్..క‌టౌట్ ఉన్నోడి సినిమాకి ఇలా టికెట్ రేట్లు పెంచాల్సిన ప‌నిలేదని..ఒక‌వేళ పెంచినా ఆ ధ‌ర అన్న‌ది సామాన్య‌ప్రేక్ష‌కుడికి సైతం అందుబాటులో ఉండాల‌నే వాద‌న తెర‌పైకి వ‌స్తుంది. మ‌ల‌యాళ సినిమాలు తెలుగులో కూడా కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌డుతున్నాయి.

2018, మంజుమ్మ‌ల్ బోయ్స్, ప్రేమ‌లు లాంటి సినిమాలు తెలుగులో మంచి ఫ‌లితాలు సాధించాయి. ఆ సినిమాల్లో ఎక్క‌డా క‌టౌట్ లేదు. అందులో న‌టీన‌టులెవ‌రూ తెలుగు ఆడియ‌న్స్ కి తెలిసిన వారు కాదు. కేవ‌లం కంటెంట్ తో మాత్ర‌మే తెలుగు ప్రేక్ష‌కులు మెచ్చిన చిత్రాలుగా నిలిచాయి. ఆ సినిమాల‌కు భారీ టికెట్ రేట్లు కూడా పెంచ‌లేదు. సాధార‌ణ ధ‌ర‌తోనే రిలీజ్ అయి మంచి వ‌సూళ్లను రాబ‌ట్టాయి. వాస్త‌వానికి ఆ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యే స‌మ‌యానికి మాతృభాష‌లో రిలీజ్ అవుతాయి.

పైరసీ కూడా అయిపోతుంది. ఇంట‌ర్నెట్ లో హెచ్ డీ ప్రింట్ ఉంటుంది. కానీ తెలుగు ఆడియ‌న్స్ మాత్రం మంచి టాక్ వ‌చ్చిన చిత్రాల‌ను థియేట‌ర్లో చూడ‌టానికే ఇష్ట‌ప‌డుతున్నారు? అన‌డానికి ఇవీ సజీవ సాక్షాలు కాదా? అలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు తెలుగు నుంచి రిలీజ్ అయితే వంద‌ల కోట్లు సాధ్యం కాదా? వారంలోనే టికెట్ ధ‌ర‌లు పెంచి ప్రేక్ష‌కుడిని న‌డ్డి విరిచేయాలా? వందల కోట్లు ఖ‌ర్చు చేసామ‌ని ప్రేక్ష‌కుడి ఆదాయాల‌తో సంబంధం లేకుం డా ఇష్టాను సారం టికెట్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం భావ్య‌మేనా? అని సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటి జ‌నులు మండి ప‌డుతున్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు కూడా స‌రైన ఆలోచ‌న‌తో పెంపు జీవోలు రిలీజ్ చేయాల‌ని కోరుతున్నారు.

Tags:    

Similar News