ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్.. ఒక్క ట్యాగ్ లైన్.. పిచ్చ హైప్
అదే సమయంలో పవర్ స్టార్ పవన్ నటిస్తున్న గ్యాంగ్ స్టర్ 'ఓజీ'(ఒరిజినల్ గ్యాంగ్ స్టార్) మూవీటీమ్ కూడా ఇదే ఫార్ములాను ఉపయోగించింది
ఓ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్ ఒక్కటే దారి. అయితే అది అందరూ చేస్తారు. కానీ అందులోను కొత్తదనం ఉండాల్సిందే. అప్పుడే ఆడియెన్స్ ఆకర్షితులవుతారు. సినిమాలో ఏదో ప్రత్యేకత ఉందని నమ్మి.. ఆసక్తిని పెంచుకుంటారు. థియేటర్లకు వస్తారు. అయితే ఇప్పుడు చిత్రసీమలో ఓ కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. అదే హ్యాష్ ట్యాగ్ లైన్స్.
దర్శకనిర్మాతలు తమ సినిమాలోని హీరో పాత్రను ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో చెప్పడానికి ఈ ట్యాగ్ లైన్స్ ను బాగా ఉపయోగిస్తున్నారు. ఒకే ఒక్క పదాన్ని ఉపయోగించి సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మోస్ట్ అవైటెడ్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే వాటిలో త్వరలోనే రిలీజ్ కానున్న చిత్రాలు ప్రభాస్ 'సలార్'- పవన్ 'ఓజీ'. ఈ రెండు చిత్రాల్లో కథ ఎలా ఉంటుందో తెలీదు కానీ.. సినీప్రియుల్లో మాత్రం ఊహించలేనంత విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అయింది. ఈ చిత్రాలు కనుక థియేటర్లలోకి వస్తే బాక్సీఫీస్ షేకే అని భావిస్తున్నారు.
అందుకు కారణం.. ఈ రెండు చిత్రాలకు తమ దర్శకనిర్మాతలకు క్రియేట్ చేసిన ట్యాగ్ లైన్స్. సలార్ లో ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేయడానికి 'యాంగ్రీ డైనోసార్' అనే పదాన్ని ఉపయోగించారు. రిలీజైన ట్రైలర్ లోనూ అదే చూపించారు. డేంజరస్ యానిమల్స్ ఎన్ని ఉన్నా.. జురాసిక్ పార్క్ లో మాత్రం డైనోసారే డేంజర్ అంటూ ప్రభాస్ ను చూపించారు. అంటే ఇక్కడ ప్రభాస్ చుట్టూ ఎంత భయంకరమైన వ్యక్తులు ఉన్నా.. ప్రభాస్ ను మించే మోస్ట్ వైలెంట్ పర్సన్ మరొకరు లేరు అని తెలియజేశారు. సోషల్ మీడియాలో ఈ యాంగ్రీ డైనోసార్ హ్యాష్ ట్యాగ్ పుల్ ట్రెండ్ అవుతోంది. దీంతో సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఉత్సుకత రోజోరోజుకు ఆడియెన్స్, అభిమానుల్లో తెగ పెరిగిపోతుంది.
అదే సమయంలో పవర్ స్టార్ పవన్ నటిస్తున్న గ్యాంగ్ స్టర్ 'ఓజీ'(ఒరిజినల్ గ్యాంగ్ స్టార్) మూవీటీమ్ కూడా ఇదే ఫార్ములాను ఉపయోగించింది. తాజాగా మొదటి నుంచి 'ది ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్' అంటూ చెప్పిన మేకర్స్ తాజాగా పవన్ పుట్టినరోజున టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ ను 'హంగ్రీ చీతా' సెప్టెంబర్ 2న రాబోతుందని ట్వీట్ చేశారు. అంటే పవన్ ను ఇక్కడ 'ఆకలితో ఉన్న చిరుత పులి' రాబోతుందంటూ అభివర్ణించారు. దీంతో అభిమానుల్లో పవన్ ను ఎలా చూపించబోతున్నారా అని ఓ రేంజ్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. చిత్రంతో పవన్.. శ్రతువులను ఆకలితో ఉన్న చిరుత పులిలా వేటాడుతూ చంపుతాడని అర్థమైంది. దీంతో సోషల్ మీడియాలో హంగ్రీ చీతా హ్యాష్ ట్యాగ్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై కూడా ఉత్సుకత రోజురోజుకు భారీగా పెరుగుతూ పోతోంది.
ఫైనల్ గా చెప్పాలంటే ఈ రెండు సినిమాలపై కేవలం హ్యాష్ ట్యాగ్ లైన్స్ తో హై ఒల్జేజ్ క్యూరియాసిటినీ పెంచేశారు మేకర్స్. మరి ఈ రెండు చిత్రాలు అంచనాలను అందుకుంటాయా లేదా అనేది తెలియాలంటే.. బొమ్మ తెరపై పడేవరకు లెట్స్ వెయిట్.