హైకోర్టులో ఈ రూల్ పాసైతే రివ్యూవర్లపై బాంబ్
ఈ కేసుపై విచారణకు పిలిచిన న్యాయస్థానం, సానుకూల నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది
సినిమా రిలీజైన 48 గంటల్లోపు బ్లాగులు, యూట్యూబ్ లో సినిమా సమీక్షలను ప్రసారం చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ కేరళ నిర్మాత రాష్ట్ర హై కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. బ్లాగర్లు యూట్యూబర్‌లు సినిమాలపై ప్రతికూలతను సృష్టిస్తున్నారని, ఇది సినీతారలు ప్రతిభావంతుల అవకాశాలను ప్రభావితం చేస్తోందనేది పిటిషనర్ల వాదన. ఈ కేసుపై విచారణకు పిలిచిన న్యాయస్థానం, సానుకూల నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
అయితే కోర్టు ఇరువైపులా సమన్యాయాన్ని పాటించేందుకు ఇంకా ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు.
అయితే ప్రతికూల సమీక్షలతో కూడ కొన్ని చిత్రాలు థియేటర్లలో బాగా ఆడాయని, ప్రేక్షకులు తెలివిగా సినిమాలను ఎంచుకుంటున్నారని, ప్రతికూల సమీక్షలను పెద్దగా పట్టించుకోవడం లేదని కోర్టు గమనించింది.
48 గంటల పాటు సినిమాలపై రివ్యూలపై ఆంక్షలు విధిస్తూ కొత్త ఉత్తర్వులు తీసుకొచ్చే అవకాశంపై కోర్టు నుంచి స్పష్ఠత ఇంకా లేదు. నిర్మాతలు కోరినట్టు చట్టం ఆమోదం పొందినట్లయితే ఇది కేరళలోని సమీక్షకుల తీరుపై గణనీయమైన ప్రభావం పడుతుంది. కేరళ నియమాన్ని ఇతర సినీపరిశ్రమలకు విస్తరించాలనే డిమాండ్ పెరుగుతుంది.
సినిమా రివ్యూవర్లపై `ఆరోమాలింటే ఆదితే ప్రాణాయామ్` సినిమా దర్శకుడు ముబిన్ రవూఫ్ తదితరులు కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. సినిమా విడుదలైన 2 రోజుల పాటు సమీక్షలను నిలిపివేయాలన్న పిటిషన్‌పై అమికస్ క్యూరీ (కోర్టు సలహాదారు) నివేదికను సమర్పించారు.