ఈ వారం 13 సినిమాలు, 3 సిరీస్ లు.. వారికి కలిసొచ్చేనా..
ఇప్పుడు ఈ నెల ఆఖరి వారంలో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి.
గత వారం చిన్న చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు రాగా.. ఇప్పుడు ఈ నెల ఆఖరి వారంలో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. ఓటీటీలోనూ పలు హిట్ చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు కాంబోలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'గాండీవధారి అర్జున'. సాక్షి వైద్య హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. వరుణ్‌తేజ్ సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా థియేటర్‌లలో రిలీజ్ కానుంది. ఘోస్ట్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ప్రవీణ్ సత్తారు ఈ చిత్రంతో రాబోతున్నారు. ఈ చిత్రం అటు వరుణ్‌కు ఇటు ప్రవీణ్ సత్తారు ఎంతో కీలకం.
కార్తికేయ, నేహా శెట్టి కలిసి క్లాక్స్ దర్శకత్వంలో నటించిన మూవీ 'బెదురు లంక 2012'. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఆర్ ఎక్స్ 100 తర్వాత కార్తికేయ ఎన్నో చిత్రాలు చేశారు. కానీ ఒక్కటి ఆర్స్ 100 రేంజ్లో హిట్ అందుకోలేదు. ఈ సినిమాపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు.
ఇంకా థియేటర్లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్- ఐశ్వర్య లక్ష్మి నటించిన 'కింగ్ ఆఫ్ కొత్త' ఆగస్ట్ 24న రిలీజ్ కానుంది. అభిలాష్ జోషిలీ దర్శకుడు. ఆగస్టు 25న విజయ్ రాజ్ కుమార్, నేహా పటాని జంటగా భరత్ మిత్ర తెరకెక్కించిన చిత్రం 'ఏం చేస్తున్నావ్' విడుదల కానుంది. చిన్న చిత్రంగా రిలీజై కన్నడలో ఘనవిజయం సాధించిన 'హాస్టల్ హుడుగారు బేకగిద్దరే'... తెలుగులో 'బాయ్స్ హాస్టల్' ఆగస్టు 26న విడుదలవుతోంది.
ఓటీటీలో కూడా పలు చిత్రాలు/సిరీస్‌లు అలరించనున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో పవన్‌కల్యాణ్ - సాయిధరమ్ తేజ్ 'బ్రో'(ఆగస్టు 25), రగ్నరోక్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 24, కిల్లర్ బుక్ క్లబ్ (హాలీవుడ్) ఆగస్టు 25, లిఫ్ట్ (హాలీవుడ్) ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. 'ఆహా'లో కల్ట్ క్లాసిక్ హిట్ బేబీ, 'డిస్నీ+హాట్‌స్టార్'లో ఆఖ్రి సోచ్ (హిందీ సిరీస్) ఆగస్టు 25, 'బుక్ మై షో'లో సమ్‌వేర్ ఇన్ క్వీన్స్ (హాలీవుడ్) ఆగస్టు 21, లయన్స్‌గేట్‌ప్లేలో ఎబౌట్ మై ఫాదర్ (హాలీవుడ్) ఆగస్టు 25, 'జియో' సినిమాలో లఖన్ లీలా భార్గవ (హిందీ) ఆగస్టు 21, బజావ్ (హిందీ) ఆగస్టు 25, 'యాపిల్ టీవీ ప్లస్'లో ఇన్వాజిన్2 (వెబ్‌సిరీస్)ఆగస్టు 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.