రీమేక్ హక్కులు చేతిలో ఉంటే ఇన్ని లాభాలా?
రవితేజ-హరీష్ శంకర్‌ల కాంబోను పరిశీలిస్తే మిస్టర్ బచ్చన్ మేకర్స్‌కు చక్కని లాభం చేకూరుస్తుందని అంచనా. రీమేక్ హక్కులు దగ్గర ఉంచుకున్నందున ఏషియన్ సునీల్ రూ. 4 కోట్లు సునాయాసంగా రాబట్టనున్నాడు.
మాస్ మహారాజా రవితేజ.. మాస్ యాక్షన్ హీరోల డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో గతంలో మిరపకాయ్ - షాక్ లాంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా కాలానికి ఇప్పుడు మరోసారి ఇదే కాంబినేషన్ రిపీటవుతోంది. రవితేజ -హరీష్ శంకర్ మూడవసారి ఓ రీమేక్ కోసం పని చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ని ఇప్పటికే ప్రకటించగా అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది.
ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఇది హిందీ సినిమా 'రైడ్'కి రీమేక్. ఏషియన్ సునీల్ రైడ్ రీమేక్ హక్కులను చాలా కాలం క్రితమే సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు వారి నుంచి మిస్టర్ బచ్చన్ రీమేక్ హక్కులను 2 కోట్లకు కొనుగోలు చేశారు. ఇంత మొత్తం చెల్లించడమే గాక.. ఆసియా సునీల్‌తో 20 శాతం లాభాలను పంచుకుంటారు.
రవితేజ-హరీష్ శంకర్‌ల కాంబోను పరిశీలిస్తే మిస్టర్ బచ్చన్ మేకర్స్‌కు చక్కని లాభం చేకూరుస్తుందని అంచనా. రీమేక్ హక్కులు దగ్గర ఉంచుకున్నందున ఏషియన్ సునీల్ రూ. 4 కోట్లు సునాయాసంగా రాబట్టనున్నాడు. రీమేక్ సినిమా తీయకుండానే సునీల్ భారీ మొత్తాన్ని జేబులో వేసుకుంటున్నాడు. వేసవిలోపు షూటింగ్ పూర్తి అవుతుంది. హరీష్ ఈ సినిమాని చక్కని మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెరకెక్కించేందుకు చాలా కసరత్తు చేసాడని తెలిసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ కెళ్లాల్సి ఉన్నా అది ఆలస్యమైంది. ఎన్నికల కోడ్ వచ్చేస్తున్నందున పవన్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈలోగా హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ ని పూర్తి చేస్తారు.