మిస్టర్ బచ్చన్ ట్రైలర్ మాస్ అండ్ గ్లామర్ టచ్

ఈ ట్రైలర్ ని హరీష్ శంకర్ తన స్టైల్ ఆఫ్ టేకింగ్ తో ప్యూర్ గా కమర్షియల్ అండ్ యాక్షన్ మిక్స్ చేసి ప్రెజెంట్ చేశాడు.

Update: 2024-08-08 03:55 GMT

మాస్ మహారాజ్ రవితేజ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి ఏడాదికి పైగా అయిపొయింది. వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవితో కలిసి రవితేజ సూపర్ హిట్ అందుకున్నారు. తరువాత వచ్చిన మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేదు. అయితే ఈ సారి ఎలా అయిన సక్సెస్ కొట్టాలనే కసితో రవితేజ ఉన్నట్లు కనిపిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

ఆగష్టు 15న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. మిక్కీ జె మియర్ బెస్ట్ పాటలు ఇచ్చాడనే మాట వినిపిస్తోంది. తాజాగా మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ట్రైలర్ ని హరీష్ శంకర్ తన స్టైల్ ఆఫ్ టేకింగ్ తో ప్యూర్ గా కమర్షియల్ అండ్ యాక్షన్ మిక్స్ చేసి ప్రెజెంట్ చేశాడు. ట్రైలర్ మొదటి ఫ్రేమ్ లోని మాస్ మహారాజ్ రవితేజని పెర్ఫెక్ట్ గా ఎలివేట్ చేశారు.

సరిహద్దుని కాపాడేవాడే కాదు సంపదని కాపాడేవాడు కూడా సైనికుడే అంటూ రవితేజ చెప్పే డైలాగ్ తో మిస్టర్ బచ్చన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. తరువాత హీరోయిన్ క్యారెక్టర్ ని పరిచయం చేసి ఆమెని రవితేజ లవ్ లో పడేయడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నాడు చూపించారు. కాస్తా ఫన్ అండ్ రొమాంటిక్ టచ్ తో ఈ సీక్వెన్స్ హరీష్ ప్రెజెంట్ చేశారు. తరువాత హీరోయిన్ తో మంచి మాస్ డ్యూయెట్ ని చూపించారు.

ఓ బిగ్ షాట్ మీద ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలని బచ్చన్ కి ఫోన్ రావడంతో ట్రైలర్ ని సీరియస్ టోన్ లోకి తీసుకొని వెళ్లారు. ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా మిస్టర్ బచ్చన్ వరుస రైడ్స్ చేస్తూ ప్రతినాయకుడు అయిన జగపతిబాబుని టచ్ చేస్తాడు. ఇద్దరి మధ్య సీరియస్ యాక్షన్ ఎలివేషన్స్ తో ట్రైలర్ లో విజువల్ ని ప్రెజెంట్ చేశారు. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఇండియన్ ఆర్మీ అంత పవర్ ఫుల్ అని నిరూపిస్తా అనే హీరో చెప్పే డైలాగ్ తో కంటెంట్ ని పవర్ ఫుల్ గా రిప్రజెంట్ చేశారు.

ఫైనల్ గా రవితేజ హీరోయిన్ తో ఫోన్ లో మాట్లాడుతూ చాలా మంది భయపడేది సమస్యలకి కాదు. పుకార్లకి, రూమర్లకు. పనిపాట లేని చాలా మంది పకోడీ గాళ్ళు ఇదే పనిమీద ఉంటారు అనే డైలాగ్ తో హరీష్ శంకర్ చాలా మందికి తన స్టైల్ లో పరోక్షంగా ట్రైలర్ తో కౌంటర్ ఇచ్చాడు. ఆగష్టు 15న షోలే మూవీ రిలీజ్ అయ్యింది అని రవితేజ చెప్పే డైలాగ్ తో మూవీ మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ ని కూడా ట్రైలర్ లో రవితేజ క్యారెక్టర్ తో చెప్పించాడు. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తుంటే ప్యూర్ మాస్ టచ్ తోనే కమర్షియల్ ఎంటర్టైనర్ గా మిస్టర్ బచ్చన్ ఉండబోతోందనే విషయాన్ని హరీష్ శంకర్ ఆడియన్స్ ని చెబుతున్నట్లు ఉంది. కథ కూడా చాలా సింపుల్ గా ఉండబోతోందని అర్ధమవుతోంది. హరీష్ శంకర్ సినిమాల స్టోరీ సింపుల్ గా ఉన్న స్క్రీన్ ప్లే తో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసి మ్యాజిక్ చేస్తారు. ఈ మూవీతో కూడా అలాగే చేస్తాడా అనేది చూడాలి.

Full View
Tags:    

Similar News