మృణాల్.. పస లేని పార్టీ!

సినిమాల్లో సీరియస్ రోల్స్, ఎమోషనల్ క్యారెక్టర్స్ పోషించే మృణాళ్ ఠాకూర్ రియల్ లైఫ్‌లో మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది.;

Update: 2025-03-05 06:00 GMT

సినిమాల్లో సీరియస్ రోల్స్, ఎమోషనల్ క్యారెక్టర్స్ పోషించే మృణాళ్ ఠాకూర్ రియల్ లైఫ్‌లో మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎప్పుడూ ఉల్లాసంగా, నవ్వుతూ, ఫుల్ ఎనర్జీతో కనిపించే ఆమె సోషల్ మీడియాలోనూ అదే ఎటిట్యూడ్‌ను కొనసాగిస్తుంటుంది. ఇక ఈమధ్య కెరీర్ పరంగా వేగం తగ్గినా సరే బాలీవుడ్ లో మళ్ళీ బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది.

ప్రస్తుతం ఆమె అజయ్ దేవగన్‌ హీరోగా తెరకెక్కుతున్న సన్ ఆఫ్ సరదార్ 2లో కూడా నటిస్తోంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుండగా, మృణాళ్ క్యారెక్టర్‌కు మంచి స్కోప్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రెండు ఇండస్ట్రీల్లోనూ ఎంటర్టైనింగ్, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌ ఎంచుకుంటూ కెరీర్‌లో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతోంది.

ఇక పర్సనల్ లైఫ్ లో ఆమె ఎంజాయ్ చేసే విధానం ఎలా ఉంటుందో ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సరదా వీడియో ద్వారా తెలిపింది. వీడియో షేర్ చేస్తూ, ‘హిట్టు పాటకి ఫ్లాప్ షో’ అనే క్యాప్షన్‌తో తన ఫాలోవర్లను నవ్వించింది. మృణాళ్ తన టీమ్‌తో కలిసి కార్‌లో ట్రావెల్ చేస్తూ ధనుష్ పాపులర్ సాంగ్ 'వై థిస్ కోలేవేరి' పాటను సరదాగా ఆలపించింది. షూటింగ్ ముగిసిన తర్వాత తమకు ప్యాక్ అప్ డాన్స్ చేసే అవకాశం రాలేదని, అందుకే కార్‌లోనే మజా చేసుకున్నామని చెప్పింది.

సింపుల్ కానీ ఫన్నీ వీడియో కావడంతో నెటిజన్లు కూడా దీన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వీడియోపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. పాపం పస లేని పార్టీలో మృణాల్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కేవలం సరదా వీడియోలే కాదు, ఇటీవల మృణాళ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలు ఇంట్రెస్టింగ్ ఫోటోలు షేర్ చేసింది. కేవలం లుక్‌తోనే కాదు, మృణాళ్ ఆరోగ్యంపై, పర్సనల్ కేర్‌పై కూడా చాలా కేర్ తీసుకుంటుంది.

గతేడాది డెంగ్యూ రావడంతో భారీగా హెయిర్ ఫాల్‌ సమస్య ఎదుర్కొన్నానని ఇటీవల షేర్ చేసింది. కానీ సరైన ట్రీట్మెంట్, న్యూట్రీషన్ మెయింటెయిన్ చేయడంతో ఇప్పుడు కొత్తగా తల వెంట్రుకలు పెరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేసింది. హేర్ ఫాల్ సమస్య ఉన్నవారికి కొన్ని టిప్స్ కూడా ఇచ్చింది ఎక్కువ ప్రొడక్ట్స్ ఉపయోగించకూడదు, రెగ్యులర్ ఆయిల్ మసాజ్ చేయాలి, ప్రాపర్ డైట్ ఫాలో కావాలి అని సజెస్ట్ చేసింది. ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ తన కెరీర్‌లో దూసుకెళ్తోంది. తెలుగులో డెకయిట్ అనే పాన్ ఇండియా చిత్రంలో అడివి శేష్‌తో కలిసి నటిస్తోంది. ఈ సినిమాతో షనీల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, అక్కినేని సుప్రియ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో ఆమె పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News