ట్రైన్ లో నుంచి దూకి ఆత్య‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నా!

ఎలాంటి ప‌రిస్థితుల్లోకి సినిమాల్లోకి వ‌చ్చినా బ్యాక్ గ్రౌండ్ లేని వారు ఇవ‌న్నీ ఫేస్ చేయాల్సిందే. ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా అలా సినిమాల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-10-11 05:11 GMT

సినిమాల్లోకి రావాల‌న్నా? స‌క్సెస్ అవ్వాల‌న్నా? ఎంతో ఫ్యాష‌న్ ఉంటే త‌ప్ప సాధ్యం కాదు. ధృడ‌మైన సంక‌ల్ప బ‌లం ఉంటేనే ఇక్క‌డ అన్ని అవ‌రోధాలు దాటుకుని ముందుకెళ్ల‌గ‌ల‌రు. స‌క్సెస్ అవ్వ‌గ‌ల‌రు. ఎలాంటి ప‌రిస్థితుల్లోకి సినిమాల్లోకి వ‌చ్చినా బ్యాక్ గ్రౌండ్ లేని వారు ఇవ‌న్నీ ఫేస్ చేయాల్సిందే. ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా అలా సినిమాల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తొలుత బుల్లి తెర‌పై ఎంట్రీ ఇచ్చి అటుపై సినిమాల్లో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వచ్చింది.

 

నేడు పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయింది. అయితే ఇదంతా రాత్రికి రాత్రే జ‌రిగిపోలేదు. 18 ఏళ్ల వ‌య‌సులో ప‌డిన బీజం అది. ఓ అవ‌మానాని గురైన సంద‌ర్భంలో ఛాలెంజ్ చేసి మ‌రీ సినిమాల్లోకి వ‌చ్చింది. మ‌రి అలాంటి న‌టికి కూడా ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు వచ్చాయా? తాను సైతం ప్రాణాలు అర్పించాల‌నుకుందా? అంటే అవుననే అంటోంది. 'ఇంటర్‌ అయ్యాక డెంటిస్ట్‌ అవ్వాలనిపించింది. బీడీఎస్‌ చేద్దామని ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ రాసి మంచి ర్యాంకు తెచ్చుకున్నా. దానికే మా అమ్మానాన్నలు నేను డాక్టరైనంత సంబరపడిపోయారు. కానీ కొన్నిరోజులకి మీడియాలోకి వెళదామనిపించింది. అమ్మానాన్నలేమో ఆ రంగంలోకి వద్దంటే వద్దన్నారు. నాన్న కూల్‌గా ఉన్నరోజు '3 ఇడియట్స్‌' చూపించా. నచ్చిన పనే చేయాలనే ఆ సినిమా సందేశం వారికి నచ్చి ప్రోత్సహించడం మొదలుపెట్టారు.

అలా బ్యాచిలర్స్‌ ఇన్‌ మాస్‌ మీడియా లో చేరా. అయితే నాన్న తన స్నేహితులకి నా చదువు గురించి చెబితే వాళ్లు 'బీఎమ్‌ఎమ్‌ నా... అదేం కోర్సు? ఎప్పుడూ వినలేదే' అన్నప్పుడు మాత్రం ఆయన చాలా బాధపడేవారు. కొన్నాళ్లకి నాన్నకి మరోప్రాంతానికి బదిలీ కావడంతో నేను ముంబయిలో ఉండాల్సొచ్చింది. ఆ సమయంలో ఒకవైపు ఒంటరితనం, మరోవైపు నాన్నని బాధపెడుతున్నానన్న భావన.. చదువుమీద దృష్టి పెట్టలేకపోయేదాన్ని. మీడియా రంగం కూడా నాకు కరెక్ట్‌ కాదని కొంతకాలానికి అనిపించింది.

ఇన్ని ఆలోచనలతో డిప్రెషన్‌లోకి వెళ్లా. కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనలొచ్చేవి. డోర్‌ దగ్గర నిలబడి లోకల్‌ ట్రైన్‌లో కాలేజీకి వెళుతుంటే కిందకు దూకేయాల నిపించేది. అలా చేస్తే అమ్మానాన్నలు తట్టుకోలేరని క్రమంగా సమస్య నుంచి బయటపడే ప్రయత్నాలు చేశా. అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన స్నేహితుల వల్ల వచ్చింది' అని అంది.

Tags:    

Similar News