దిల్ రాజు అంటే మినిమమ్ ఆ రేంజ్ ఉంటది మరి!
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో ఫస్ట్ మూవీతోనే సూపర్ క్రేజ్ దక్కించుకుంది. సీతగా అందరి మనసులు దోచుకుంది. స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. నాన్ స్టాప్ గా ఆఫర్లు వస్తున్నా.. ఆచితూచి అడుగులు వేస్తోంది. గతేడాది నేచురల్ స్టార్ నానితో జతకట్టింది. హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన యాక్టింగ్ తో అలరించింది.
ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా.. వేసవి కానుకగా రిలీజ్ కానుంది. మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో విడుదల అవ్వనుంది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ఠాకూర్.. దిల్ రాజుతో పనిచేసిన అనుభవాన్ని షేర్ చేసుకుంది. "దిల్ రాజు సర్ తో మరోసారి కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది. జెర్సీ రీమేక్ తర్వాత ఆయన ప్రొడక్షన్ లో ఇది నా రెండో సినిమా. అందుకు చాలా సంతోషంగా ఉంది. దిల్ రాజు నిర్మాణ సంస్థలో పనిచేస్తుంటే బాలీవుడ్ బడా సంస్థలు యష్ రాజ్ ఫిల్మ్స్ , ధర్మ ప్రొడక్షన్స్ తో వర్క్ చేసినట్లు అనిపిస్తుంది" అని మృణాల్ చెప్పింది.
హైదరాబాద్ ను తన కొత్త ఇల్లుగా భావిస్తున్నట్లు తెలిపింది మృణాల్. టాలీవుడ్ పెద్ద ప్రాజెక్ట్స్ లో పనిచేయడం చాలా సంతోషంగా అనిపిస్తున్నట్లు చెప్పింది. తెలుగు నిర్మాణ సంస్థను బీటౌన్ టాప్ సంస్థలతో ఆమె పోల్చడాన్ని నెటిజన్లు సమర్థిస్తున్నారు. టాలీవుడ్ నిర్మాణ సంస్థలు SVC, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ తోపాటు పలు సంస్థలు ఏమాత్రం తక్కువ కాదని మృణాల్ గుర్తు చేసిందని అంటున్నారు.
"ఇక ఫ్యామిలీ స్టార్ మూవీలో డ్యాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ టైమ్ లో ఫుల్ ఎంజాయ్ చేశాను. రఘు మాస్టర్ తో వర్క్ చాలా ఫన్నీగా ఉంటుంది. కళ్యాణీ వచ్చా వచ్చా పాట.. ప్రాపర్ వెడ్డింగ్ సాంగ్. మీరు ఆ పాట ఎప్పుడు వస్తుందా? అని కచ్చితంగా వెయిట్ చేస్తారు. గోపీ సుందర్ సార్ మ్యూజిక్ సూపర్" అని తెలిపింది మృణాల్ ఠాకూర్. మరి ఈ మూవీతో మన సీత హ్యాట్రిక్ కొడుతుందో లేదో చూడాలి.