మృణాల్ మనసంతా ఇక్కడే..

వివరాళ్లోకి వెళితే.. హిందీలో వరుసగా నటించినా... తెలుగులో మాత్రం ఆచితూచి సినిమా కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది మృణాల్. ఎన్ని అవకాశాలను వస్తున్నా సెలెక్ట్​గా కథలను ఎంచుకుంటోంది.

Update: 2023-10-18 03:45 GMT

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న భామ మృణాల్ ఠాకూర్. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసి.. అందరి మనసుల్లో సీతగా నిలిచిపోయింది. దీంతో ఈ భామ ఇక తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ భామ అలా చేయలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఫుల్​ ఫోకస్ టాలీవుడ్​పైనే పెట్టినట్టు తెలుస్తోంది.

వివరాళ్లోకి వెళితే.. హిందీలో వరుసగా నటించినా... తెలుగులో మాత్రం ఆచితూచి సినిమా కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది మృణాల్. ఎన్ని అవకాశాలను వస్తున్నా సెలెక్ట్​గా కథలను ఎంచుకుంటోంది. అందుకే సీతారామం వచ్చి చాలా కాలమైనా తెలుగులో రెండు ప్రాజెక్ట్​లను మాత్రమే ఓకే చేసింది. ఇప్పుడా సినిమాలు బ్యాక్​ టు బ్యాక్​ రిలీజెస్​కు రెడీ అయ్యాయి. అందులో ఒకటి నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన హాయ్ నాన్న. మరొకటి రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా.

ఈ రెండు చిత్రాలు కూడా తక్కువ గ్యాప్​లోనే తెర పైకి రానుండటం విశేషం. నానికి జంటగా మృణాల్ నటించిన హాయ్​ నాన్న డిసెంబర్ 7న విడుదల కానుండగా.. విజయ్ దేవరకొండకు జోడిగా మిస్ ఠాకూర్ అభినయిస్తున్న ప్రాజెక్ట్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి తక్కువ గ్యాప్​లోనే రాబోతున్న ఈ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో మృణాల్ ఠాకూర్ ఎలాంటి రిజల్ట్​ అందుకుంటుందో చూడాలి..

అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో రెండు ప్రాజెక్ట్​లను లైన్​లో పెట్టిందని తెలిసింది. ఆ చిత్రాల దర్శకనిర్మాతలు.. హాయ్​ నాన్న, విజయ్ దేవరకొండ సినిమాల రిజల్ట్​తో పాటు ఇతర విషయాలపై కాస్త చర్చించి మృణాల్​ తీసుకునే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారట.

అలానే మృణాల్​ కూడా తెలుగు ఇండస్ట్రీలో గుర్తుండిపోయే పాత్రలను చేయాలని తాను అనుకుంటున్నట్లు ఇటీవలే తెలిపింది. అందుకే పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో తెలుగు అవకాశాల పట్ల ఆమె నిబద్ధతను మెచ్చుకోవాల్సిందేనని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News