తెలుగు డిజైనర్ 1400 గం.ల శ్రమ ఫలితమిది
తెలుగమ్మాయిలు డిజైనర్లుగా రాణిస్తున్నారు. ఫ్యాషన్ ప్రపంచపు మంత్రగత్తెలుగా వెలుగుతున్నారు
తెలుగమ్మాయిలు డిజైనర్లుగా రాణిస్తున్నారు. ఫ్యాషన్ ప్రపంచపు మంత్రగత్తెలుగా వెలుగుతున్నారు. తెలుగు సినీపరిశ్రమలో ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది ఫ్యాషన్ డిజైనర్లు తెలుగు వారు ఉన్నారు. ఇందులో అను పెళ్లకూరు ఒకరు. ఇప్పుడు మృణాల్ ధరించిన డిజైనర్ లెహంగా ఈ తెలుగమ్మాయి ఖ్యాతిని వినువీధుల్లో విహరింపజేస్తోంది.
తాజాగా బిటి ఫ్యాషన్ వీక్‌లో తెలుగు డిజైనర్ అను పెళ్లకూరు పేరు మార్మోగింది. దీనికి కారణం తను డిజైన్ చేసిన ప్రత్యేక డిజైనర్ లెహంగా. అను పెళ్లకూరు కొత్త డిజైనర్ టాప్.. చీర రంగు ఎరుపు. ఇదే నేపథ్యంలో పువ్వులు ఆకుల డిజైన్ తో అందంగా కనిపించింది. ఈ డిజైన్ లో పట్టు పెర్ల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎంతో హైలైట్ గా కనిపిస్తోంది. ఈ ఘనతకు కారకురాలైన డిజైనర్ అనూని మృణాల్ ప్రశంసించారు. ''నా డిజైనర్ అను గురించి నేను చాలా గర్వపడుతున్నాను.. నేను ర్యాంప్‌పై నడవడం చాలా అద్భుతంగా ఉంది. ఈ దుస్తులను తయారు చేయడానికి అనూ 1400 గంటలు వెచ్చించింది'' అని మృనాల్ తెలిపింది.
పువ్వులు, ఆకులు, అందమైన ముత్యాల చేరికతో ఈ డిజైనర్ లుక్ ని డిజైన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని మృణాల్ తెలిపింది. భారతీయ సాంప్రదాయ దుస్తులంటే ప్రాణం అని కూడా అంది. తాజా డిజైన్ పెళ్లిళ్ల సీజన్ కి సరిపోయేది. '' ర్యాంప్ వాక్ సరదాగా ఉంది.. కొంత భయం కూడా ఉంది'' అని వ్యాఖ్యానించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. నానితో హాయ్ నాన్న, దేవరకొండతో ఫ్యామిలీ స్టార్‌లో కనిపించిన మృణాల్, ప్రస్తుతం 'పూజా మేరీ జాన్' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో శింబుతో కూడా ఒక సినిమా చేస్తోంది. తదుపరి ప్రభాస్ సరసనా నటించేందుకు ఆస్కారం లేకపోలేదని గుసగసలు వినిపిస్తున్నాయి.