'సీతారామం' బ్యూటీ ప్రేమలో ఉందట...!
హాలీవుడ్ నటుడు కీను రీవ్స్ అంటే తనకు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఇష్టం అని.. ఆయనతో తనది వన్ సైడ్ లవ్ అంది.
ఉత్తరాది ప్రేక్షకులను తన అందంతో పాటు అభినయంతో మెప్పించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు తెలుగు లో సీతారామం సినిమా తో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే స్టార్ గా నిలిచింది. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ అందాల ఆరబోత సీతారామం సినిమాలో చేయకున్నా కూడా ఆ తర్వాత సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూనే ఉంది.
మొదటి సినిమా సీతారామం సక్సెస్ తర్వాత టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ భారీ ఆఫర్లను ఈ అమ్మడు దక్కించుకుంటున్న విషయం తెల్సిందే. ఎప్పుడూ కూడా హాట్ ఫోటోలు లేదా ఏదో ఒక సినిమా విషయం తో వార్తల్లో నిలిచే మృణాల్ ఠాకూర్ ఈసారి తన ప్రేమ విషయాన్ని వెళ్లడించడం ద్వారా వార్తల్లో నిలిచింది.
మృణాల్ ఠాకూర్ ని ఎంతో మంది అభిమానులు ఆరాధిస్తూ ఉంటారు.. ఆమెను ప్రేమిస్తూ ఉంటారు. వారందరిది కూడా వన్ సైడ్ లవ్. అలాగే మృణాల్ కూడా ఒక వ్యక్తితో వన్ సైడ్ లవ్ లో ఉందట. ఈ విషయాన్ని స్వయంగా తాజా ఇంటర్వ్యూలో మృణాల్ తెలియజేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
హాలీవుడ్ నటుడు కీను రీవ్స్ అంటే తనకు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఇష్టం అని.. ఆయనతో తనది వన్ సైడ్ లవ్ అంది. చిన్నతనంలోనే చూసి ప్రేమలో పడ్డట్లుగా కూడా చెప్పుకొచ్చింది. తాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కీను రీవ్స్ వంటి జీవిత భాగస్వామి తనకు రావాలని కోరుకుంటున్నట్లుగా మృణాల్ చెప్పుకొచ్చింది.