శెట్టిస్.. సౌండ్ లేదు.. అలా చేయకపోతే అంతే ఇక

మరో ఐదు రోజుల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ కానుంది. చాలా గ్యాప్ తర్వాత జేజమ్మ అనుష్కను తెరపైన చూడబోతున్నాం.

Update: 2023-09-02 12:56 GMT

మరో ఐదు రోజుల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ కానుంది. చాలా గ్యాప్ తర్వాత జేజమ్మ అనుష్కను తెరపైన చూడబోతున్నాం. అభిమానులకు ఈ సినిమాపై మంచి నమ్మకాలే ఉన్నాయని మొన్నటివరకు అనిపించింది. కానీ ఇప్పుడా పరిస్థితి కనపడట్లేదేమో అనిపిస్తోంది. అంతగా బజ్, హైప్ కనపడట్లేదు. సోషల్ మీడియాలోనూ అంతా సైలెంట్ గానే ఉంది.

హీరో నవీన్ పోలిశెట్టి ఏమో.. కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ఊరూరా తిరిగి ప్రమోషన్ చేస్తుకుంటున్నారు. మీడియా, అభిమానుల ముందుకు రావడానికి అనుష్క ఆసక్తి చూపకపోవడం వల్ల.. భారం మొత్తం తనపైనే వేసుకుని నవీన్ తిరుగుతున్నారు. సినిమాకు వీళ్లద్దరే స్పెషల్ అట్రాక్షన్. అయినా వారిద్దరి స్టార్ డమ్ రేంజ్ కు తగ్గట్టు.. ఉండాల్సిన రేంజ్ లో హైప్ మాత్రం కనపడట్లేదు.

నిజానికి ఇలా ఉన్నప్పడు.. ప్రమోషన్స్ ను ఇంకా డిఫరెంట్ గా ప్లాన్ చేయాలి. పబ్లిసిటీ స్పీడ్ పెంచాలి. ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా ఉన్న దారులన్నీ వెతికి మరీ హంగామా చేస్తుండాలి. ఇది ఒక్క పోలిశెట్టితో అయ్యేట్టు కనపడట్లేదు. అనుష్క దిగాల్సిందేమో అనట్టుగా ఉంది. కానీ ఇది జరిగే పని కాదు. అసలే ఈ సారి బాక్సాఫీస్ పోటీలో చాలానే సినిమాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ రూట్ మార్చి తమిళ డైరెక్టర్ జవాన్ తో వస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మంచిగానే జరుగుతున్నట్టు కనిపిస్తోంది.

దీంతో పాటే ఆపై వారం సెప్టెంబర్ 15న , చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీ లాంటివి వస్తున్నాయి. మరి వాటిని తట్టుకుని రెండో వారం కూడా ముందుకు సాగాలంటే.. సినిమా కంటెంట్ పరంగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. మరి ఈ సినిమా ఎక్స్ పెరిమెంట్ సబ్జెట్ తో వస్తోంది. భర్త లేకుండా పిల్లల్ని కనాలనే మహిళా పాత్రలో అనుష్క, జీవితంలో ఆనందంగా సరదాగా ఉండాలని కోరుకునే స్టాండప్ కమెడియన్ గా నవీన్ పోలిశెట్టి.. డిఫరెంట్ రోల్స్ చేశారు. మరి ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో.

అదే సమయంలో ఈ చిత్రం ముందుగా మంచి ఓపెనింగ్స్ అందుకోవడం కూడా ముఖ్యమే. కాబట్టి ప్రమోషన్స్ లో ఇంకా స్పీడ్ పెంచి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది కూడా చేయాలి. కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు. ఒకవేళ చేసినా అనుష్క వస్తదన్న గ్యారంటీ లేదు. ఈవెంట్ కు సంబంధించిన డీటెయిల్స్ బయటకు రాలేదు. మరి శెట్టి జంట ఏం చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News