బడా నిర్మాణ సంస్థలో వాటా కోసం అపర కుబేరుడు!
అయితే గత కొన్ని రోజులుగా, కరణ్ జోహార్ తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో వాటాను విక్రయించ డానికి ఆసక్తిగా ఉన్నారనే వార్తలు ఊపందుకున్నాయి.
బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అదో బ్రాండ్ నిర్మాణ సంస్థగా కొన్ని దశాబ్ధాలుగా సేవలు అందిస్తోంది. ధర్మ ప్రొడక్ష్సన్స్ నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే? ఆ సంస్థ బ్రాండ్ చూసే థియేటర్ కి వెళ్లే అభిమానులెంతో మంది ఉన్నారు. అంతగా సంస్థ అధినేత కరణ్ జోహార్ నిర్మాణ సంస్థని అభివృద్దిలోకి తీసుకొచ్చారు.
అయితే గత కొన్ని రోజులుగా, కరణ్ జోహార్ తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో వాటాను విక్రయించ డానికి ఆసక్తిగా ఉన్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఆర్‌పి సంజీవ్ గోయెంకా గ్రూప్‌కు చెందిన సరిగమ ఇండియా వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందని ప్రచారంలోకి వచ్చింది. డీల్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడీ వ్యవహారంలో భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ కూడా ఎంటర్ అయినట్లు వినిపిస్తుంది.
ధర్మ ప్రొడక్షన్స్‌లో వాటాను కొనుగోలు చేయడానికి ఆయన కూడా సీన్ లోకి దిగినట్లు ప్రచారం జరుగు తోంది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతినిధులు ధర్మ ప్రొడక్షన్స్ తో టచ్ లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే ఈ డీల్ అంత త్వరగా ముగిసేది కాదని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా చాలా చర్చలు, సమావేశాలు అవసరంగా రిలయన్స్ భావిస్తోందిట.
గతంలో ఈ సంస్థలో షేర్ తీసుకోవాలని గౌతమ్ అదానీ కూడా చర్చలు జరిపారు. కానీ డీల్ కుదరక పోవడంతో అదానీ వదిలేసారు. ప్రస్తుతానికి, ధర్మ ప్రొడక్షన్స్‌లో 90.7% వాటా కరణ్ జోహార్ మరియు 9.24% అతని తల్లి హిరూ జోహార్ కలిగి ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ యొక్క బాలాజీ టెలిఫిల్మ్స్‌లో 25 శాతం వాటాను కలిగి ఉంది. ఇంకా సొంతంగా జియోని లాంచ్ అందులోనూ సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతున్నారు.